తెలుగు సోదర సోదరి రావా
పల్లవిసోదర సోదరి రావా - సంతస వార్తను వినవా
సిలువే శరణని గనవా - శ్రీయేసుని మది జేకొనవా
1)పాపములో జన్మించి - పాపములో జీవించి
పాపములో చనిపోతే - పాతాళమే నీ యంతం
|| సోదర ||
2)పాపము పోవాలంటే - పావన రక్తమే మార్గం
పావనుడెవరీ భువిలో - ప్రభుయేసుడు గాకెవ్వరు
|| సోదర ||
3)పరలోకమునువీడి - పరులగు లోకుల గోరి
నరునిగ జన్మించినను - పరిపూర్ణుడె శ్రీయేసు
|| సోదర ||
4)మాటతో మృతులను లేపి - మాటతో కుంటిని నడిపి
మాటతో పొంగును ఆపి - మాటతో మహిమలు జేసె
|| సోదర ||
5)మనకై మరణించుటకై - మానవుడొకడవసరము
కలుషము మోసిన యేసే - కలువరికేగెను గనవా
|| సోదర ||
6)అయ్యో శిరమున ముండ్లు - అరచేతులలో చీలల్
అరకాళ్ళలో బలుమేకుల్ - అందమెలేదా ప్రభుకు
|| సోదర ||
7)సకలము జేసిన యేసే - చావును గెలిచిన యేసు
జీవితమిచ్చిన యెడల - జీవము నిచ్చును నీకు - నిత్య
|| సోదర ||
English Sodara Sodari Raavaa
ChorusSodara Sodari Raavaa - Santasa Vaartanu Vinavaa
Siluve Saranani Ganavaa - Sreeyesuni Madi Jekonavaa
1)Paapamulo Janminchi - Paapamulo Jeevinchi
Paapamulo Chanipote - Paataalame Nee Yantan
|| Sodara ||
2)Paapamu Povaalante - Paavana Raktame Maargam
Paavanudevaree Bhuvilo - Prabhuyesudu Gaakevvaru
|| Sodara ||
3)Paralokamunuveedi - Parulagu Lokula Gori
Naruniga Janminchinanu - Paripoornude Sreeyesu
|| Sodara ||
4)Maatato Mrtulanu Lepi - Maatato Kuntini Nadipi
Maatato Pongunu Aapi - Maatato Mahimalu Jese
|| Sodara ||
5)Manakai Maraninchutakai - Maanavudokadavasaramu
Kalushamu Mosina Yese - Kaluvarikegenu Ganavaa
|| Sodara ||
6)Ayyo Siramuna Mundlu - Arachetulalo Cheelal
Arakaallalo Balumekul - Andameledaa Prabhuku
|| Sodara ||
7)Sakalamu Jesina Yese - Chaavunu Gelichina Yesu
Jeevitamichchina Yedala - Jeevamu Nichchunu Neeku - Nitya
|| Sodara ||