తెలుగు సిలువ వైపు చూడుమా
పల్లవిసిలువ వైపు చూడుమా - పిలుపు యేసుదే సుమా
నిలువుమా యోచించుమా - తెలుసుకొనుమా ప్రభుప్రేమ
మారుమనసు నొందుమా
1)నీ పాప భారమంత - కలువరిలో మోసెను
సిలువ మరణమొందెను - కలుషమంత బాపెను
|| సిలువ ||
2)తన యవ్వన రక్తమంత - నీ కొరకే కార్చెను
క్రయధనముగ నిచ్చెను - విడుదల దయచేసెను
|| సిలువ ||
3)రక్షకుడే నీకు బదులు - శిక్షననుభవించెను
ఈ క్షణమే ప్రభుని నమ్ము - రక్షణ దయచేయును
|| సిలువ ||
4)రేపు నీది కాదురా - వీపుజూపబోకురా
నేటిదినమే నీదిరా - యేసుప్రభుని వేడరా
|| సిలువ ||
5)జీవగ్రంథమందు నీదు - పేరును లిఖియించును
జీవదాత యేసు నీకు - నిత్యజీవమిచ్చును
|| సిలువ ||
English Siluva Vaipu Chuudumaa
ChorusSiluva Vaipu Choodumaa - Pilupu Yesude Sumaa
Niluvumaa Yochinchumaa - Telusukonumaa Prabhuprema
Maarumanasu Nondumaa
1)Nee Paapa Bhaaramanta - Kaluvarilo Mosenu
Siluva Maranamondenu - Kalushamanta Baapenu
|| Siluva ||
2)Tana Yavvana Raktamanta - Nee Korake Kaarchenu
Krayadhanamuga Nichchenu - Vidudala Dayachesenu
|| Siluva ||
3)Rakshakude Neeku Badulu - Sikshananubhavinchenu
Ee Kshaname Prabhuni Nammu - Rakshana Dayacheyunu
|| Siluva ||
4)Repu Needi Kaaduraa - Veepujoopabokuraa
Netidiname Neediraa - Yesuprabhuni Vedaraa
|| Siluva ||
5)Jeevagranthamandu Needu - Perunu Likhiyinchunu
Jeevadaata Yesu Neeku - Nityajeevamichchunu
|| Siluva ||