తెలుగు సాటిలేనిది యేసుని రక్షము
పల్లవిసాటిలేనిది యేసుని రక్తము - పాపమును కడుగును
ప్రియుడా పాపమపును కడుగును
1)చూడుము సోదరా! దేవుడు ఎంతో ప్రేమించె యీ జగతిన్
ప్రియుడా ప్రేమించే యీ జగతిన్ - సిలువలో ప్రాణము నర్పించ
క్రీస్తు యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను
|| సాటి ||
2)లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగా నిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె - లోక పాపమెల్ల సిలువలో
మోసి తొలగించె శాపమున్ ప్రియుడా - తొలగించె శాపమున్
|| సాటి ||
3)వినుము సోదరా ! ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను - ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి ప్రియుడా - చాటించు చుంటిమి
|| సాటి ||
4)యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయంబుతో
ప్రియుడా విరిగిన హృదయంబుతో - యేసుని అమూల్య
రక్తధారలే - కడుగును పాపమెల్ల ప్రియుడా - కడుగును పాపమెల్ల
|| సాటి ||
5)పాపభారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా
ప్రియుడా ప్రయాసమొందెదవా - పాపమొప్పుకొని యేసు
పాదముల - చెంతకు జేరుము ప్రియుడా - చెంతకు జేరుము
|| సాటి ||
6)గతించుచున్నది స్వల్ప జీవితము - శీఘ్రముగా రమ్ము
ప్రియుడా శీఘ్రముగా రా రమ్ము - కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ నొందుము ప్రియుడా రక్షణ నొందుము
|| సాటి ||
7)కృపయానందము పవిత్ర ప్రేమలో - భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము - పాపసాగరమును దాటించ
గలడు - యేసు రక్షకుడే ప్రియుడా - యేసు రక్షకుడే
|| సాటి ||
English Saatillenidi Yesuni Rakshamu
ChorusSaatilenidi Yesuni Raktamu - Paapamunu Kadugunu
Priyudaa Paapamapunu Kadugunu
1)Choodumu Sodaraa! Devudu Ento Preminche Yee Jagatin
Priyudaa Preminche Yee Jagatin - Siluvalo Praanamu Narpincha
Kreestu Yesuni Panpenu - Priyudaa Yesuni Panpenu
|| Saati ||
2)Lokamuna Karudenchi Kreestu Prabhuvu - Praanamu Baligaa Nichche
Priyudaa Praanamu Baligaa Nichche - Loka Paapamella Siluvalo
Mosi Tolaginche Saapamun Priyudaa - Tolaginche Saapamun
|| Saati ||
3)Vinumu Sodaraa ! Prabhu Yesu Kreestuni Paraloka Vaartanu
Priyudaa Paraloka Vaartanu - Unnatamaina Paraloka Premanu
Chaatinchu Chuntimi Priyudaa - Chaatinchu Chuntimi
|| Saati ||
4)Yesuni Neevu Kshaminchumani Vedu - Virigina Hrudayanbuto
Priyudaa Virigina Hrudayanbuto - Yesuni Amoolya
Raktadhaarale - Kadugunu Paapamella Priyudaa - Kadugunu Paapamella
|| Saati ||
5)Paapabhaaramunu Mosikoni Neevu - Prayaasa Mondedavaa
Priyudaa Prayaasamondedavaa - Paapamoppukoni Yesu
Paadamula - Chentaku Jerumu Priyudaa - Chentaku Jerumu
|| Saati ||
6)Gatinchuchunnadi Svalpa Jeevitamu - Seeghramugaa Rammu
Priyudaa Seeghramugaa Raa Rammu - Karta Yesunandu Visvaasamunchi
Rakshana Nondumu Priyudaa Rakshana Nondumu
|| Saati ||
7)Krupayaanandamu Pavitra Premalo - Bhaagamu Pondumu
Priyudaa Bhaagamu Pondumu - Paapasaagaramunu Daatincha
Galadu - Yesu Rakshakude Priyudaa - Yesu Rakshakude
|| Saati ||