Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 688 Old No: 331

ప్రియుడా ప్రభుని చేరరా

Priyudaa Prabhuni Cheraraa

Open in Word & Worship App
తెలుగు   ప్రియుడా ప్రభుని చేరరా
పల్లవి
ప్రియుడా ప్రభుని చేరరా - మోక్షప్రదాత ప్రభుయేసేగా
నశించిన దానిని వెదకి - కృశించిన వారిని చూచి
రక్షింప వచ్చిన దేవుడు - రక్షకుడు క్రీస్తేసుడు
1)
మనలోన ప్రతివాడు పాపంబుకు - దాసులమైనాము
అది ఎరుగుము - పాపంబు జీతంబు మరణంబెగా
ప్రభు క్రీస్తుని నమ్ము అది తప్పును
|| ప్రియు ||
2)
నరకాగ్ని బాధలను గాంచుమా - మలమల అగ్నిలో
మాడెదవు - పటపట పండ్లను కొరికెదవు
వేదనతో కన్నీళ్ళు కార్చెదవు
|| ప్రియు ||
3)
పరలోక భాగ్యంబును గాంచుమా - సకల సౌఖ్యంబులను
పొందెదవు - ఆకలి దప్పులచ్చట వుండవు
దుఃఖము నిట్టూర్పులే వుండవు
|| ప్రియు ||
4)
జీవన్మరణ మార్గములు రెండయా - ఏ మార్గమును నీవు
కోరెదవో - నేడే నిర్ణయించుకో ప్రియుడా
జీవంపు మార్గంబె సుఖదాయకం
|| ప్రియు ||
5)
ప్రభుని కనుగొను వాడేనయా - జీవంబును తాను
కనుగొనును - అసహ్యపడేటి వారందరు
మరణంబును తాము స్నేహింతురు
|| ప్రియు ||
6)
ప్రతి మనుష్యుని కొరకు ప్రభుయేసుడు - మరణంబును
తాననుభవించెను - మృతినిగెల్చి యేసు లేచెనయా
మదిని యేసుని నమ్మి మోక్షమొందు
|| ప్రియు ||
English   Priyudaa Prabhuni Cheraraa
Chorus
Priyudaa Prabhuni Cheraraa - Mokshapradaata Prabhuyesegaa
Nasinchina Daanini Vedaki - Krusinchina Vaarini Choochi
Rakshinpa Vachchina Devudu - Rakshakudu Kreestesudu
1)
Manalona Prativaadu Paapanbuku - Daasulamainaamu
Adi Erugumu - Paapanbu Jeetanbu Marananbegaa
Prabhu Kreestuni Nammu Adi Tappunu
|| Priyu ||
2)
Narakaagni Baadhalanu Gaanchumaa - Malamala Agnilo
Maadedavu - Patapata Pandlanu Korikedavu
Vedanato Kanneellu Kaarchedavu
|| Priyu ||
3)
Paraloka Bhaagyanbunu Gaanchumaa - Sakala Saukhyanbulanu
Pondedavu - Aakali Dappulachchata Vundavu
DuHkhamu Nittoorpule Vundavu
|| Priyu ||
4)
Jeevanmarana Maargamulu Rendayaa - e Maargamunu Neevu
Koredavo - Nede Nirnayinchuko Priyudaa
Jeevanpu Maarganbe Sukhadaayakan
|| Priyu ||
5)
Prabhuni Kanugonu Vaadenayaa - Jeevanbunu Taanu
Kanugonunu - Asahyapadeti Vaarandaru
Marananbunu Taamu Snehinturu
|| Priyu ||
6)
Prati Manushyuni Koraku Prabhuyesudu - Marananbunu
Taananubhavinchenu - Mrtinigelchi Yesu Lechenayaa
Madini Yesuni Nammi Mokshamondu
|| Priyu ||
Present