తెలుగు పాపి యేసుని యొద్దకు
పల్లవిపాపి యేసుని యొద్దకు రమ్ము - నిన్ను రక్షించువాడు ఆయనే
మరి ధరణిలో ఎవ్వరులేరుగ - నిన్ను రక్షించువాడే నిజముగ
1)ఆదాము హవ్వలు ఏదేను తోటలో - కాపురముండి జీవించిరి
ఒక్కనాడు సైతానుని చేతిలో - చిక్కిపోయిరి ఆదామవ్వలు
తినవద్దని చెప్పిన ఫలములు - తిని పాపంబులో పడిపోయిరి
|| పాపి ||
2)పాపులకొరకు శ్రీ యేసు ప్రభువు - శ్రమలన్నిటిని ఓర్చియున్నాడు
ఎన్నో గాయంబుల తానొంది - సిలువ మ్రానుపై రక్తము కార్చి
నిన్ను రక్షింప వచ్చియున్నాడు - రమ్ము యేసుని యొద్దకు నేడే
|| పాపి ||
3)యేసుని రాకడ సమీపమాయెను - తెలిసికొనండి ప్రజలారా
ఇక రేపో మాపో రానై యున్నాడు - కడబూర మ్రోగగనే యేసు
తన మోక్షంబు లోపల జేర్చును - దాపుజేరిన భక్తులనెల్లను
|| పాపి ||
English Paapi Yesuni Yoddhaku
ChorusPaapi Yesuni Yoddaku Rammu - Ninnu Rakshinchuvaadu Aayane
Mari Dharanilo Evvaruleruga - Ninnu Rakshinchuvaade Nijamuga
1)Aadaamu Havvalu edenu Totalo - Kaapuramundi Jeevinchiri
Okkanaadu Saitaanuni Chetilo - Chikkipoyiri Aadaamavvalu
Tinavaddani Cheppina Phalamulu - Tini Paapanbulo Padipoyiri
|| Paapi ||
2)Paapulakoraku Sree Yesu Prabhuvu - Sramalannitini Orchiyunnaadu
Enno Gaayanbula Taanondi - Siluva Mraanupai Raktamu Kaarchi
Ninnu Rakshinpa Vachchiyunnaadu - Rammu Yesuni Yoddaku Nede
|| Paapi ||
3)Yesuni Raakada Sameepamaayenu - Telisikonandi Prajalaaraa
Ika Repo Maapo Raanai Yunnaadu - Kadaboora Mrogagane Yesu
Tana Mokshanbu Lopala Jerchunu - Daapujerina Bhaktulanellanu
|| Paapi ||