Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 684 Old No: 327

ఓ పాపి జీవపు యూటకురా

O Paapi Jeevapu Yootakuraa

Open in Word & Worship App
తెలుగు   ఓ పాపి జీవపు యూటకురా
పల్లవి
ఓ పాపి జీవపు యూటకురా - పాపభారముతోడరా రక్షకుడు
నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
1)
తామసము చేయకుము - తరుణమును వీడకుము
కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
|| తామ ||
2)
ఉన్న పాటున రమ్ము యేసునొద్దకు - పన్నుగ కాచియున్నాడు
సింధుర పాపమైనను - బంధురముగ మాయమౌ
|| తామ ||
3)
రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు
పశ్చాత్తాపమొందు వారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్‌
|| తామ ||
4)
పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు
సంతోషగాన వితతులచే వింతగ పాడుదురు
|| తామ ||
5)
వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు
సాకులు చెప్పువారల నెల్ల - శిక్షకు నియమించును
|| తామ ||
6)
యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా
యెల్లరకును మేలు చేసెను - పిల్చుచున్నాడిపుడు
|| తామ ||
7)
హల్లెలూయ పాటపాడెదము - చల్లని ఆత్మవలన
నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చును
|| తామ ||
English   O Paapi Jeevapu Yootakuraa
Chorus
O Paapi Jeevapu Yootakuraa - Paapabhaaramutodaraa Rakshakudu\nNinnu Pilchuchunnaadu - Akshaya Jeevameeyanu
1)
Taamasamu Cheyakumu - Tarunamunu Veedakumu\nKrupato Ninnu Rakshinchunu - Krupato Rammanenu
|| Taama ||
2)
Unna Paatuna Rammu Yesunoddaku - Pannuga Kaachiyunnaadu\nSindhura Paapamainanu - Bandhuramuga Maayamau
|| Taama ||
3)
Rakshakuni Vaakkulanniyu - Rayamuna Nammuchu\nPaschaattaapamondu Vaaralaku - Nischaya Rakshana Nichchunu
|| Taama ||
4)
Paapi Manassu Maarunapudu - Paramandali Dootalu\nSantoshagaana Vitatulache Vintaga Paaduduru
|| Taama ||
5)
Vaakkula Neraverchina Yesu - Maata Tappanivaadu\nSaakulu Cheppuvaarala Nella - Sikshaku Niyaminchunu
|| Taama ||
6)
Yesu Nangeekarinchuvaaralanu - Cheyunu Suddhulugaa\nYellarakunu Melu Chesenu - Pilchuchunnaadipudu
|| Taama ||
7)
Hallelooya Paatapaadedamu - Challani Aatmavalana\nNaathuni Neevu Vedakina - Saadhuga Eevula Nichchunu
Present