తెలుగు పరుగిడరా సోదరుడా
పల్లవిపరుగిడరా సోదరుడా! ప్రభు సన్నిధి నీవు జేరుటకై ఆ\... (2)
1)యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా!
వేదనలెన్నో మీదికి వచ్చురా కలవర మొందక కనిపెట్టుమురా
|| పరుగి ||
2)ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు
త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనపుడు
దొంగవలె యిల దొరయై వచ్చుర
|| పరుగి ||
3)ఆదినమైనను ఆఘడియైనను - పరమున దూతలు ధరణిలో
మనుజులు - ఎవరును గాని యెరుగనే యెరుగరు
మెలుకువతో యేసు పిలుపును వినుచు
|| పరుగి ||
4)ఆర్భాటముతో - దేవుని బూరతో మధ్యాకాశమునకు
ప్రభురాగా క్రీస్తునందున్న మృతులు సజీవులు
ఏకముగా ప్రభు యేసుని జేరున్
|| పరుగి ||
5)ఆ దినముల శ్రమ అంతముకాగా - సూర్యుని చంద్రుని
చీకటి కమ్మును - ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహి దిగురా
|| పరుగి ||
6)ఎటుచూచిన నీ కటు కనిపించును - కొండల బండలు
నుండినను - కొందమ సింహమై కోపాగ్నియై - ఎదురుగ
వచ్చిన కదలగలేవురా
|| పరుగి ||
English Parugidaraa Sodarudaa
ChorusParugidaraa Sodarudaa! Prabhu Sannidhi Neevu Jerutakai Aa\... (2)
1)Yuga Samaaptiki Aagamanamunaku Soochanalenno Choodumuraa!
Vedanalenno Meediki Vachchuraa Kalavara Mondaka Kanipettumuraa
|| Parugi ||
2)Indlanu Gattuchu Pendliki Yichchuchu - Naarunu Naatuchu
Traaguchu Tinuchu Jagamulo Janulu Digulu Lenapudu
Dongavale Yila Dorayai Vachchura
|| Parugi ||
3)Aadinamainanu Aaghadiyainanu - Paramuna Dootalu Dharanilo
Manujulu - Evarunu Gaani Yerugane Yerugaru
Melukuvato Yesu Pilupunu Vinuchu
|| Parugi ||
4)Aarbhaatamuto - Devuni Boorato Madhyaakaasamunaku
Prabhuraagaa Kreestunandunna Mrtulu Sajeevulu
ekamugaa Prabhu Yesuni Jerun
|| Parugi ||
5)Aa Dinamula Srama Antamukaagaa - Sooryuni Chandruni
Cheekati Kammunu - Aakasamandali Saktulu Kadalunu
Mahimato Yesu Yimmahi Diguraa
|| Parugi ||
6)Etuchoochina Nee Katu Kanipinchunu - Kondala Bandalu
Nundinanu - Kondama Sinhamai Kopaagniyai - Eduruga
Vachchina Kadalagalevuraa
|| Parugi ||