Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 68 Old No: 664

సర్వ శక్తి గల దేవుని సన్నిధి

Sarva Sakti Gala Devuni Sannidhi

♪ Dara Paul Sudhakar
Open in Word & Worship App
తెలుగు   సర్వ శక్తి గల దేవుని సన్నిధి
పల్లవి
సర్వశక్తి గల దేవుని - సన్నిధి చేర సిద్ధపడెదం
ఆయనే మనకు ఆశ్రయ దుర్గం - ఆయనే మనకు జీవాధిపతి
1)
సర్వసృష్టికి ఆధారుడు - సర్వజ్ఞాన సంపన్నుడు
కృపాసత్య సంపూర్ణునిగా - తన సర్వము మన
కర్పించెను - విరిగి నలిగిన హృదయముతో మన
దేవుని సన్నిధి చేరుదము
|| ఆయనే ||
2)
కల్మషమంటని మనస్సుతో - ప్రోక్షింపబడిన
హృదయముతో - నిర్మలమైన శరీరముతో
సంపూర్ణమైన నిశ్చయతతో - యదార్ధమైన
హృదయముతో మన - దేవుని సన్నిధి చేరుదము
|| ఆయనే ||
3)
ప్రభువైన యేసుని రాకడలో - మన ఆత్మ జీవ
శరీరములు - నిందా రహితతో సంపూర్ణముగా
పరిశుద్ధాత్మతో నిలుచుటకు - పవిత్రమైన
హృదయముతో మన - దేవుని సన్నిధి చేరుదము
|| ఆయనే ||
English   Sarva Sakti Gala Devuni Sannidhi
Chorus
Sarvasakti Gala Devuni - Sannidhi Chera Sidhapadedam
Aayane Manaku Aasraya Durgan - Aayane Manaku Jeevaadhipati
1)
Sarvasrushtiki Aadhaarudu - Sarvagnaana Sanpannudu
Krupaasatya Sanpoornunigaa - Tana Sarvamu Mana
Karpinchenu - Virigi Naligina Hrudayamuto Mana
Devuni Sannidhi Cherudamu
|| Aayane ||
2)
Kalmashamantani Manassuto - Prokshinpabadina
Hrudayamuto - Nirmalamaina Sareeramuto
Sanpoornamaina Nischayatato - Yadaardhamaina
Hrudayamuto Mana - Devuni Sannidhi Cherudamu
|| Aayane ||
3)
Prabhuvaina Yesuni Raakadalo - Mana Aatma Jeeva
Sareeramulu - Nindaa Rahitato Sanpoornamugaa
Parisudhaatmato Niluchutaku - Pavitramaina
Hrudayamuto Mana - Devuni Sannidhi Cherudamu
|| Aayane ||
Present