తెలుగు దైవవరము జేవ జలము
పల్లవిదైవవరము జీవ జలము త్రాగ రారండి - దైవపుత్రుని
జీవదానము - పొంద రారండీ - పొందరారండీ
1)పాపమనెడి మురికిలో - పొర్లాడుచున్న - మనుష్యుడా
స్వనీతి వలన దొరుకదు - ఆ గొప్ప రక్షణ ప్రియుడా - మరణశిక్ష
రాకమునుపే - రారమ్ము రారమ్ము
|| దైవ ||
2)ధరణిలోని జలములెల్ల - దేహశుద్ధి కొరకెగా - సిలువలో
మీ కొరకు యేసు - కార్చిన రక్తము మాత్రమే - హృదయశుద్ది
నీయగలదు - రారండీ - రారండీ
|| దైవ ||
3)దాహమడుగ తనకు - బంటు లిచ్చినట్టి చిరకను - త్రాగి యేసు
మనకునిచ్చె - మధురమైన జలమును - నిత్యజీవజలము
పొంద - రారండీ - రారండీ
|| దైవ ||
4)నమ్మికతో నాడు దొంగ - త్రాగె జీవజలమును - నీతి కర్త
ప్రేమతో - కార్చిన శుద్ధరక్తము - క్రొత్త జన్మ మివ్వగలదు
రారండీ - రారండీ
|| దైవ ||
English Daivavaramhu Jeeva Jalamu
ChorusDaivavaramu Jeeva Jalamu Traaga Raarandi - Daivaputruni
Jeevadaanamu - Ponda Raarandee - Pondaraarandee
1)Paapamanedi Murikilo - Porlaaduchunna - Manushyudaa
Svaneeti Valana Dorukadu - Aa Goppa Rakshana Priyudaa - Maranasiksha
Raakamunupe - Raarammu Raarammu
|| Daiva ||
2)Dharaniloni Jalamulella - Dehasuddhi Korakegaa - Siluvalo
Mee Koraku Yesu - Kaarchina Raktamu Maatrame - Hrudayasuddi
Neeyagaladu - Raarandee - Raarandee
|| Daiva ||
3)Daahamaduga Tanaku - Bantu Lichchinatti Chirakanu - Traagi Yesu
Manakunichche - Madhuramaina Jalamunu - Nityajeevajalamu
Ponda - Raarandee - Raarandee
|| Daiva ||
4)Nammikato Naadu Donga - Traage Jeevajalamunu - Neeti Karta
Premato - Kaarchina Sudharaktamu - Krotta Janma Mivvagaladu
Raarandee - Raarandee
|| Daiva ||