తెలుగు రమ్ము సహోదరా
పల్లవిరమ్ము సహోదరా - రమ్ము సహోదరీ - రక్షింప యేసు
నిను పిలుచుచుండె రమ్ము సహోదరి
1)నాశనకరమగు మార్గములోన - తిరుగుచుండగ - ఆశతోడ
పాప క్రియలు జేయచుండగ - నశియించిన వారిని - వెదకి
రక్షింప - యేసుండు వచ్చెనుగా
|| రమ్ము ||
2)స్వనీతివల్ల స్వర్గభాగ్యం పొందలేరుగా - సత్యుడేసుని మదిలో
నమ్మిన ముక్తి కల్గునుగా - యేసుని నమ్మి సౌఖ్యంబునొందు
లేకుంటే దుఃఖముగా
|| రమ్ము ||
3)నరుల దురితంబు బాప - ధరలోన ప్రభువు - రుధిర ధారలు గార్చె
గొఱ్ఱెపిల్లగా - రక్తంలో కడుగు నీ ఘోరపాపం రక్షకుని వేడుమా
|| రమ్ము ||
4)యేసుండే ప్రభువని పలుకు నోరార - యేసే రక్షించునని నమ్ము
మనసారా - దోసంబు బాపు రక్షకుడేసు - వాసిగ - బ్రోచునురా
|| రమ్ము ||
5)యేసుడు తప్పదైవం వేరే లేనేలేడురా - యేసుండే
సర్వజగతికి - రక్షకుండురా - యేసుని నమ్ముస్వర్గంబు కల్గు
లేకుంటే నరకమురా
|| రమ్ము ||
English Rammu Sahodaraa
ChorusRammu Sahodaraa - Rammu Sahodaree - Rakshinpa Yesu
Ninu Piluchuchunde Rammu Sahodari
1)Naasanakaramagu Maargamulona - Tiruguchundaga - Aasatoda
Paapa Kriyalu Jeyachundaga - Nasiyinchina Vaarini - Vedaki
Rakshinpa - Yesundu Vachchenugaa
|| Rammu ||
2)Svaneetivalla Svargabhaagyan Pondalerugaa - Satyudesuni Madilo
Nammina Mukti Kalgunugaa - Yesuni Nammi Saukhyanbunondu
Lekunte DuHkhamugaa
|| Rammu ||
3)Narula Duritanbu Baapa - Dharalona Prabhuvu - Rudhira Dhaaralu Gaarche
Gorrepillagaa - Raktanlo Kadugu Nee Ghorapaapan Rakshakuni Vedumaa
|| Rammu ||
4)Yesunde Prabhuvani Paluku Noraara - Yese Rakshinchunani Nammu
Manasaaraa - Dosanbu Baapu Rakshakudesu - Vaasiga - Brochunuraa
|| Rammu ||
5)Yesudu Tappadaivan Vere Leneleduraa - Yesunde
Sarvajagatiki - Rakshakunduraa - Yesuni Nammusvarganbu Kalgu
Lekunte Narakamuraa
|| Rammu ||