తెలుగు మహోన్నతుడేసు
పల్లవిమహోన్నతుడేసు - మహిమ రాజ్యములో
చేరగరండి పిలిచెనుగా - పాపి రక్షణ నొందెడి సమయమిదే
1)లోకములో భూలోకములో - నటనే యికను గతియించునుగ
శాశ్వత రాజ్యము - యేసుని రాజ్యము - శాశ్వత సౌఖ్యము
పొందగ రారా
|| మహో ||
2)అందముగ మనమందరము - ఆ సుందరుడేసుని రాజ్యములో
విందులో పాలుపొంది సదా - మనడెంద ముప్పొంగగ
పాడెద మహా
|| మహో ||
3)మనదేవుండే దేవాలయమై - క్రీస్తేసే దీపంబై వెలుగన్
భూజనులు భూరాజులు చేరి - మహిమను ఘనతను తెచ్చెదరహా
|| మహో ||
4)రాజులును భూరాజులును - తమ మహిమను ఘనతను
తెచ్చెదరు యేసుని వెలుగులో మెలగుచునుందురు - కలుగును
నెమ్మది - నమ్మినవారికి
|| మహో ||
5)కలుషాత్ముండా తడవేలనిక - నీ కలుషము బాపను శ్రీయేసు
కలువరి గిరిపై - కార్చెను రక్తము - రక్షణ నొందగనేడే రారా
|| మహో ||
English Mahonnathudesu
ChorusMahonnatudesu - Mahima Raajyamulo
Cheragarandi Pilichenugaa - Paapi Rakshana Nondedi Samayamide
1)Lokamulo Bhoolokamulo - Natane Yikanu Gatiyinchunuga
Saasvata Raajyamu - Yesuni Raajyamu - Saasvata Saukhyamu
Pondaga Raaraa
|| Maho ||
2)Andamuga Manamandaramu - Aa Sundarudesuni Raajyamulo
Vindulo Paalupondi Sadaa - Manadenda Muppongaga
Paadeda Mahaa
|| Maho ||
3)Manadevunde Devaalayamai - Kreestese Deepanbai Velugan
Bhoojanulu Bhooraajulu Cheri - Mahimanu Ghanatanu Techchedarahaa
|| Maho ||
4)Raajulunu Bhooraajulunu - Tama Mahimanu Ghanatanu
Techchedaru Yesuni Velugulo Melaguchununduru - Kalugunu
Nemmadi - Namminavaariki
|| Maho ||
5)Kalushaatmundaa Tadavelanika - Nee Kalushamu Baapanu Sreeyesu
Kaluvari Giripai - Kaarchenu Raktamu - Rakshana Nondaganede Raaraa
|| Maho ||