తెలుగు తరుణమిదే తరుణమిదే
పల్లవితరుణమిదే - తరుణమిదే పాపికి తరుణమిదే
పరలోకము జేరుటకు - ఆ నరకము తప్పుటకు
1)నీ ఆయువు నాలోచించుము - నీ బ్రతుకును ఆలోచించుము
నీ పాప ఫలిత మెపుడు - బహు భయంకర నరకమయా
|| తరుణ ||
2)నీ పాపపు పరుగులతో - ప్రళయాగ్నిలో జేరెదవా
పరలోకపు మార్గమును - తిరస్కారము చేసెదవా
|| తరుణ ||
3)నీ కొరకై శ్రీయేసు - ఆ సిలువలో బలియాయెన్
నీ రక్షణ గోరి సదా - సువార్తను వినిపించెన్
|| తరుణ ||
4)ప్రభు యేసుని రక్తములో - పరిశుద్ధుడవై ధరలో
పరమానందము నొందన్ - త్వరపడిరా ప్రార్థింపన్
|| తరుణ ||
5)కృపకాలము దాటగనే - అపాయపు దినములలో
మనుజాళికి మహాశ్రమలు - కనుపించదు ఆశ్రయము
|| తరుణ ||
6)నీ దేవుని సన్నిధిలో - కనబడుటకు సిద్ధపడుమా
నేడే రక్షణ దినము - లోక కీడును విడిచి రమ్ము
|| తరుణ ||
English Tarunamide Tarunamide
ChorusTarunamide - Tarunamide Paapiki Tarunamide
Paralokamu Jerutaku - Aa Narakamu Tapputaku
1)Nee Aayuvu Naalochinchumu - Nee Bratukunu Aalochinchumu
Nee Paapa Phalita Mepudu - Bahu Bhayankara Narakamayaa
|| Taruna ||
2)Nee Paapapu Parugulato - Pralayaagnilo Jeredavaa
Paralokapu Maargamunu - Tiraskaaramu Chesedavaa
|| Taruna ||
3)Nee Korakai Sreeyesu - Aa Siluvalo Baliyaayen
Nee Rakshana Gori Sadaa - Suvaartanu Vinipinchen
|| Taruna ||
4)Prabhu Yesuni Raktamulo - Parisuddhudavai Dharalo
Paramaanandamu Nondan - Tvarapadiraa Praarthinpan
|| Taruna ||
5)Krupakaalamu Daatagane - Apaayapu Dinamulalo
Manujaaliki Mahaasramalu - Kanupinchadu Aasrayamu
|| Taruna ||
6)Nee Devuni Sannidhilo - Kanabadutaku Sidhapadumaa
Nede Rakshana Dinamu - Loka Keedunu Vidichi Rammu
|| Taruna ||