Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 670 Old No: 312

ఇదియే సమయంబు

Idiye Samayambhu

Open in Word & Worship App
తెలుగు   ఇదియే సమయంబు
పల్లవి
ఇదియే సమయంబు రండి - యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండి - రక్షణ పొందండి
1)
పాపుల నందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా
|| ఇదియే ||
2)
రాజులకు రాజైన యేసు రానై యున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు - తయారవ్వండి
|| ఇదియే ||
3)
బుద్ధిలేని కన్యకలవలె మొద్దులుగానుంటే
సిద్దెలలోన నూనెపోసి సిద్ధపడకపోతే
తలుపును తట్టినను మీకు - తెరువడు సుమ్మండి
|| ఇదియే ||
4)
నమ్మినవారికి క్రీస్తు నెమ్మది నిచ్చెనుగా
నమ్మనివారికి నిత్యనరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ - పొందండి
|| ఇదియే ||
5)
వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - మీరు యెలుగెత్తి పిలిచినను
మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును
|| ఇదియే ||
6)
సందియ పడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణ దినమును మన మెరుగము సుమ్మండి
|| ఇదియే ||
7)
జాలము చేయకను మీరు హేళన చేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడపకను
తరుణ ముండగనే మీరు త్వరపడి రారండి
|| ఇదియే ||
English   Idiye Samayambhu
Chorus
Idiye Samayanbu Randi - Yesuni Jerandi
Ika Samayamu Ledandi Randi - Rakshana Pondandi
1)
Paapula Nandarini Tana Daapuna Jerchutakai
Praanamu Daanamugaa Tana Praanamu Nichchenugaa
Maranapu Mullunu Virichi Vijayamu Nichchenugaa
|| Idiye ||
2)
Raajulaku Raajaina Yesu Raanai Yunnaadu
Gurutulu Jarigenugaa Meeru Sarigaa Choodandi
Tarunamundagaane - Meeru - Tayaaravvandi
|| Idiye ||
3)
Buddhileni Kanyakalavale Moddulugaanunte
Siddelalona Nooneposi Sidhapadakapote
Talupunu Tattinanu Meeku - Teruvadu Summandi
|| Idiye ||
4)
Namminavaariki Kreestu Nemmadi Nichchenugaa
Nammanivaariki Nityanarakamu Tappadugaa
Nirlakshyamu Cheyakanu Randi Rakshana - Pondandi
|| Idiye ||
5)
Velupata Nuntenoo Meeru Vedana Nondedaru
Prabhuvaa Prabhuvanuchu - Meeru Yelugetti Pilichinanu
Mimmunu Eruganu Meerevaro Pommanunu
|| Idiye ||
6)
Sandiya Padakandi Meeru Saakulu Cheppakanu
Satyavaakyamunu Meeru Sarigaa Choodandi
Marana Dinamunu Mana Merugamu Summandi
|| Idiye ||
7)
Jaalamu Cheyakanu Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchu Meeru Kaalamu Gadapakanu
Taruna Mundagane Meeru Tvarapadi Raarandi
|| Idiye ||
Present