తెలుగు రండి రండి యేసుని యోద్ధకు
పల్లవిరండీ రండీ యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు - ప్రభునిచెంతకు పరుగిడి వేగమే
1)యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల అవనిలో
అగచాట్ల పాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో
|| రండి ||
2)కరవు మరణము రణముల జూచి - కలుగదు మారుమనసు
ప్రవచనములు సంపూర్ణము లాయెను - యూదులు
తిరిగి వచ్చియున్నారు
|| రండి ||
3)ప్రభుయేసు నీ కొరకై తనదు - ప్రాణమునిచ్చెగదా - సిలువను
రక్తము చిందించియును - బలియాయెను యా ఘనుడుమనకై
|| రండి ||
4)యేసుని నామమునందే - పరమ నివాసము దొరుకును
ముక్తిని పాపవిమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును
|| రండి ||
5)నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
నేనే గాకింకెవ్వరు లేరని యెంచి చెప్పిన యేసుని యొద్దకు
|| రండి ||
English Randi Randi Yesuni Yoddhaku
ChorusRandee Randee Yesuni Yoddaku Rammanuchunnaadu
Prayaasapadi Bhaaramu Moyuvaaralu - Prabhunichentaku Parugidi Vegame
1)Yesuni Pilupu Viniyu Ninka - Yochinparela Avanilo
Agachaatla Paalaina - Abbadu Saanti Aatmaku Nilalo
|| Randi ||
2)Karavu Maranamu Ranamula Joochi - Kalugadu Maarumanasu
Pravachanamulu Sanpoornamu Laayenu - Yoodulu
Tirigi Vachchiyunnaaru
|| Randi ||
3)Prabhuyesu Nee Korakai Tanadu - Praanamunichchegadaa - Siluvanu
Raktamu Chindinchiyunu - Baliyaayenu Yaa Ghanudumanakai
|| Randi ||
4)Yesuni Naamamunande - Parama Nivaasamu Dorukunu
Muktini Paapavimochanamunu - Saktimantudu Yese Yichchunu
|| Randi ||
5)Nene Maargamu Nene Satyamu - Nene Jeevamunu
Nene Gaakinkevvaru Lerani Yenchi Cheppina Yesuni Yoddaku
|| Randi ||