Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 667 Old No: 309

ప్రేమతో యేసు పిలుచు

Premato Yesu Piluchu

Open in Word & Worship App
తెలుగు   ప్రేమతో యేసు పిలుచు
పల్లవి
ప్రేమతో - యేసు పిలుచుచున్నాడు రమ్ము
రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము
1)
పాపమెరుగని ప్రభు నీ కొరకై పాపముగను చేయబడెను
శాపగ్రాహియాయె సిలువలో - పరుగిడిరమ్ము
|| ప్రేమతో ||
2)
ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మివేయబడె
ప్రాణమిడెనేసు సిలువలో - పరుగిడిరమ్ము
|| ప్రేమతో ||
3)
తానె కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంతా
తనయుడవై పోదువిపుడే - పరుగిడిరమ్ము
|| ప్రేమతో ||
4)
ప్రేమ సువార్త ప్రకటింపబడె - ప్రియుడు యేసుని యొద్దకురమ్ము
కృపాకాలమిదే జాగేల - పరుగిడిరమ్ము
|| ప్రేమతో ||
English   Premato Yesu Piluchu
Chorus
Premato - Yesu Piluchuchunnaadu Rammu
Rakshananu Pondi Lakshanamugaa Vellumu
1)
Paapamerugani Prabhu Nee Korakai Paapamuganu Cheyabadenu
Saapagraahiyaaye Siluvalo - Parugidirammu
|| Premato ||
2)
Mundla Kireetamunu Dharinchi - Mukhamupai Nummiveyabade
Praanamidenesu Siluvalo - Parugidirammu
|| Premato ||
3)
Taane Kadugunu Tana Raktamuto - Tandrivale Nee Paapamunantaa
Tanayudavai Poduvipude - Parugidirammu
|| Premato ||
4)
Prema Suvaarta Prakatinpabade - Priyudu Yesuni Yoddakurammu
Krupaakaalamide Jaagela - Parugidirammu
|| Premato ||
Present