Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 661 Old No: 348

హృదయమనెడు తలుపు

Hrudayamanedhu Thalupu

Open in Word & Worship App
తెలుగు   హృదయమనెడు తలుపు
పల్లవి
హృదయమనెడు తలుపునొద్ద - యేసు నాథుండు
నిలచి సదయుడగుచుఁ దట్టుచుండు - సకల విధములను
1)
పరుని బోలి నిలుచున్నాఁడు - పరికించి చూడ
నతఁడు - పరుఁడు గాఁడు రక్షకుండు - ప్రాణ స్నేహితుఁడు
|| హృద ||
2)
కరుణాశీలుం డతఁడు గానఁ - గాచి యున్నాఁడు
యేసు - కరుణ నెఱిఁగి గారవింపఁ - గరము న్యాయంబు
|| హృద ||
3)
ఎంత సేపు నిలువఁ బెట్టి - యేడ్పించు రతని
నాతఁడెంతో దయచేఁ బిలుచుచున్నాఁ - డిప్పుడు మిమ్ములను
|| హృద ||
4)
అతఁడు మిత్రుఁ డతడు మిత్రుఁ - డఖిల పాపులకు
మీర - లతని పిలుపు వింటిరేని - యతఁడు ప్రియుఁడగును
|| హృద ||
5)
జాలిచేతఁ దన హస్తములఁ - జాఁపి యున్నాడు
మిమ్ము - నాలింగనము సేయఁగోరి - యనిశము కనిపెట్టును
|| హృద ||
6)
సాటిలేని దయగలవాఁడు - సర్వేశు సుతుఁడు
తన మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు
|| హృద ||
7)
చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాథు
నతఁడు - చేర్చుకొనుచు మీకిచ్చును - చిరజీవముగృపను
|| హృద ||
8)
అతఁడు తప్పక కలుగఁజేయు - నఖిల భాగ్యములు
మీర - లతని హత్తుకొందు రప్పు - డానందముతోడ
|| హృద ||
9)
బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడ
గాన బ్రతికియుండు కాలముననే - ప్రభుని గొలవండి
|| హృద ||
English   Hrudayamanedhu Thalupu
Chorus
Hrudayamanedu Talupunodda - Yesu Naathundu
Nilachi Sadayudaguchun Dattuchundu - Sakala Vidhamulanu
1)
Paruni Boli Niluchunnaandu - Parikinchi Chooda
Natandu - Parundu Gaandu Rakshakundu - Praana Snehitundu
|| Hruda ||
2)
Karunaaseelun Datandu Gaanan - Gaachi Yunnaandu
Yesu - Karuna Neringi Gaaravinpan - Garamu Nyaayanbu
|| Hruda ||
3)
Enta Sepu Niluvan Betti - Yedpinchu Ratani
Naatandento Dayachen Biluchuchunnaan - Dippudu Mimmulanu
|| Hruda ||
4)
Atandu Mitrun Datadu Mitrun - Dakhila Paapulaku
Meera - Latani Pilupu Vintireni - Yatandu Priyundagunu
|| Hruda ||
5)
Jaalichetan Dana Hastamulan - Jaanpi Yunnaadu
Mimmu - Naalinganamu Seyangori - Yanisamu Kanipettunu
|| Hruda ||
6)
Saatileni Dayagalavaandu - Sarvesu Sutundu
Tana Maata Vinedu Vaarala Nella - Sootiga Rakshinchu
|| Hruda ||
7)
Cherchukonundi Mee Hrudayamuna Sree Yesunaathu
Natandu - Cherchukonuchu Meekichchunu - Chirajeevamugrupanu
|| Hruda ||
8)
Atandu Tappaka Kaluganjeyu - Nakhila Bhaagyamulu
Meera - Latani Hattukondu Rappu - Daanandamutoda
|| Hruda ||
9)
Bratuku Saasvatanbu Kaadu - Parikinchi Chooda
Gaana Bratikiyundu Kaalamunane - Prabhuni Golavandi
|| Hruda ||
Present