Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 659 Old No: 320

దేవుని ప్రేమ ఇదిగో

Devuni Prema Idigo

Open in Word & Worship App
తెలుగు   దేవుని ప్రేమ ఇదిగో
పల్లవి
దేవుని ప్రేమ యిదిగో - జనులారా - భావంబునందెలియరే
కేవలము నమ్ముకొనినఁ - పరలోక - జీవంబు మన కబ్బును
1)
సర్వలోకము మనలను - తనవాక్య - సత్యంబుతోఁజేసెను
సర్వోపకారుడుండె - మనమీద - జాలిపరుఁడై యుండెను
|| దేవుని ||
2)
మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారునిఁ బంపెను
మనశరీరముఁదాల్చెను - ఆ ప్రభువు - మన పాపముకు దూరుఁడే
|| దేవుని ||
3)
యేసు క్రీస్తను పేరున - రక్షకుడు వెలసి నాఁడిలలోపల
దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాఁడు
|| దేవుని ||
4)
పాపభారంబు తోడ నే ప్రొద్దు - ప్రయాసనములఁబొందెడి
పాపులందఱు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తుననెను
|| దేవుని ||
5)
సతులైన పురుషులైనన్‌ - యా కర్త సర్వజనుల యెడలను
సత్ప్రేమగ నడిచెను - పరలోక సద్బోధలిక జేసెను
|| దేవుని ||
6)
చావు నొందిన కొందఱిన్‌ - యేసుండు - చక్కఁగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభునంటి - స్వస్థంబు తా మొందిరి
|| దేవుని ||
7)
గాలి సంద్రపు పొంగులన్‌ - సద్ధణపి - నీళ్ళపై నడచినాఁడే
మేలుగల యద్భుతములు - ఈలాగు - వేలకొలఁదిగ జేసెను
|| దేవుని ||
8)
చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తామోర్వలేకన్‌
|| దేవుని ||
9)
ఒడలు రక్తము గారఁగ - దెబ్బలు - చెడుగు లందఱుఁగొట్టిరి
వడిముళ్ళు తలమీదఁను - బెట్టిరి ఓర్చెనో రక్షకుండు
|| దేవుని ||
10)
ఇన్ని భాదలు బెట్టుచుఁ - దనుఁ జంపు - చున్న పాప నరులను
మన్నించుమని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేఁడెను
|| దేవుని ||
11)
రక్షకుడు శ్రమఁబొందగా - దేశంబు - తక్షణము చీఁకటయ్యెన్‌
రక్షకుడు మృతి నొందఁగఁ - తెర చినిఁగి -
రాతి కొండలు పగిలెను
|| దేవుని ||
12)
రాతి సమాధిలోన - రక్షకుని - నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందఱుఁజూడంగా
|| దేవుని ||
13)
మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాఁడు
నాఁడు నమ్మిన మనుజులు చూచిరి - నలువది దినములందున్‌
|| దేవుని ||
14)
పదునొకండు మారులు - వారలకుఁ - బ్రత్యక్షుడాయె నేసు
పరలోకమున కేగెను - తనవార్త - బ్రకటించు మని పల్కెను
|| దేవుని ||
15)
నమ్మి బాప్తిస్మ మొందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్దమనెను
|| దేవుని ||
English   Devuni Prema Idigo
Chorus
Devuni Prema Yidigo - Janulaaraa - Bhaavanbunandeliyare
Kevalamu Nammukoninan - Paraloka - Jeevanbu Mana Kabbunu
1)
Sarvalokamu Manalanu - Tanavaakya - Satyanbutonjesenu
Sarvopakaarudunde - Manameeda - Jaaliparundai Yundenu
|| Devuni ||
2)
Maanavula Rakshinpanu - Devundu - Tana Kumaarunin Banpenu
Manasareeramundaalchenu - Aa Prabhuvu - Mana Paapamuku Doorunde
|| Devuni ||
3)
Yesu Kreestanu Peruna - Rakshakudu Velasi Naandilalopala
Dosakaari Janulato - Nento Su - Bhaashalanu Balkinaandu
|| Devuni ||
4)
Paapabhaaranbu Toda Ne Proddu - Prayaasanamulanbondedi
Paapulandaru Nammina - Visraanti - Paripoornamittunanenu
|| Devuni ||
5)
Satulaina Purushulainan - Yaa Karta Sarvajanula Yedalanu
Satpremaga Nadichenu - Paraloka Sadbodhalika Jesenu
|| Devuni ||
6)
Chaavu Nondina Kondarin - Yesundu - Chakkangaa Bratikinchenu
Sakala Vyaadhula Rogulu - Prabhunanti - Svasthanbu Taa Mondiri
|| Devuni ||
7)
Gaali Sandrapu Pongulan - Sadhanapi - Neellapai Nadachinaande
Melugala Yadbhutamulu - Eelaagu - Velakolandiga Jesenu
|| Devuni ||
8)
Chetula Kaallalonu - Raa Raaju - Chera Mekulu Bondenu
Paatakulu Gottinaare - Parisudha - Neeti Taamorvalekan
|| Devuni ||
9)
Odalu Raktamu Gaaranga - Debbalu - Chedugu Landarungottiri
Vadimullu Talameedannu - Bettiri Orcheno Rakshakundu
|| Devuni ||
10)
Inni Bhaadalu Bettuchun - Danun Janpu - Chunna Paapa Narulanu
Manninchumani Tandrini - Yesundu - Sannutito Vendenu
|| Devuni ||
11)
Rakshakudu Sramanbondagaa - Desanbu - Takshanamu Cheenkatayyen
Rakshakudu Mrti Nondangan - Tera Chiningi -
Raati Kondalu Pagilenu
|| Devuni ||
12)
Raati Samaadhilona - Rakshakuni - Neetigala Dehanbunu
Paati Pettiri Bhaktulu - Nammina - Naatu Landarunjoodangaa
|| Devuni ||
13)
Moodava Dinamanduna - Yesundu - Mrti Gelchi Lechinaandu
Naandu Nammina Manujulu Choochiri - Naluvadi Dinamulandun
|| Devuni ||
14)
Padunokandu Maarulu - Vaaralakun - Bratyakshudaaye Nesu
Paralokamuna Kegenu - Tanavaarta - Brakatinchu Mani Palkenu
|| Devuni ||
15)
Nammi Baaptisma Mondu - Narulaku - Rakshana Mari Kalgunu
Namma Nollaka Poyedu - Narulaku - Narakanbu Siddamanenu
|| Devuni ||
Present