తెలుగు ప్రేమ సముద్రుడ నీవే
పల్లవిప్రేమ సముద్రుడ నీవే - నీ లోనొక బిందువును
1)ద్రాక్షావల్లివి నీవె - నేనొక తీగను దేవా
మాధుర్యంబగు ఫలములనెన్నో - ఫలియించుటకు నీ కృప చూపు
|| ప్రేమ ||
2)పాటను నేనే ప్రభువా - భావము నీవే దేవా
రాగమై నేను పాడుచునుండగా - రమ్యతనీవై ఎదకదిలించు
|| ప్రేమ ||
3)పత్రిక నేనే ప్రభువా - పాఠము నీవే విభుడా
పాఠమైన నిను ప్రకటించుటలో - పరిశుద్ధాత్ముడా పని జరిగించుమా
|| ప్రేమ ||
4)నావను నేనే దేవా - చుక్కానివిగా నీవే
సేవకోసమై సాగెడు వేళ - నీవే తోడై నను బలపరచు
|| ప్రేమ ||
5)మానును నేనేనయ్యా - నాపై మంచువు నీవే
మానక నిన్ను కలిగియుండుటకు - నా ప్రభువా నీవే కృప చూపు
|| ప్రేమ ||
English Prema Samudruda Neeve
ChorusPrema Samudruda Neeve - Nee Lonoka Binduvunu
1)Draakshaavallivi Neeve - Nenoka Teeganu Devaa
Maadhuryanbagu Phalamulanenno - Phaliyinchutaku Nee Krupa Choopu
|| Prema ||
2)Paatanu Nene Prabhuvaa - Bhaavamu Neeve Devaa
Raagamai Nenu Paaduchunundagaa - Ramyataneevai Edakadilinchu
|| Prema ||
3)Patrika Nene Prabhuvaa - Paathamu Neeve Vibhudaa
Paathamaina Ninu Prakatinchutalo - Parisudhaatmudaa Pani Jariginchumaa
|| Prema ||
4)Naavanu Nene Devaa - Chukkaanivigaa Neeve
Sevakosamai Saagedu Vela - Neeve Todai Nanu Balaparachu
|| Prema ||
5)Maanunu Nenenayyaa - Naapai Manchuvu Neeve
Maanaka Ninnu Kaligiyundutaku - Naa Prabhuvaa Neeve Krupa Choopu
|| Prema ||