Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 654

యేసుని గుణాతిశయము

Yesuni Gunaatishayamu

Open in Word & Worship App
తెలుగు   యేసుని గుణాతిశయము
పల్లవి
యేసుని గుణాతి శయములను - ప్రచురము చేయు నిమిత్తమే
ఆయన సొత్తైన మనము సాగుదము వేవేగముగా
1)
నశించి పోయెడు ఆత్మలను - కృషించి పోయెడు సంఘములు
జీవమొంది ఉజ్జీవమొందగా - సదయుడేసునకు సమర్పించుచూ
|| యేసు ||
2)
మహోపకారుని మరచితివా? - ఇహాన నీపని మరచితివా ?
అహోరావముతో అగ్నికి పోయెడు - అన్యజనుల రక్షింపలెమ్మిక
|| యేసు ||
3)
యెహోవ పనికై యౌవ్వనుడా! - సహాయ పడెడు సమయమిదె
అపాయకాలము ఆలసింపదు - కృపాకాలమే కృషి చేయుమిక
|| యేసు ||
4)
రాజులైన యాజకులారా - తేజరిల్లుడీ లోకములో
క్రీస్తు మహిమకై క్రీస్తు ఘనతకై - క్రీస్తు కొరకు జీవింపలెమ్మిక
|| యేసు ||
5)
క్రీస్తుని సంఘమ మేల్కొనుమా - కోరుకొనెను నిను శ్రీయేసుడు
తేరి చూడుడీ ప్రదేశమంతయు - తేజరిల్ల నీ వల్ల నౌనుగా
|| యేసు ||
English   Yesuni Gunaatishayamu
Chorus
Yesuni Gunaati Sayamulanu - Prachuramu Cheyu Nimittame
Aayana Sottaina Manamu Saagudamu Vevegamugaa
1)
Nasinchi Poyedu Aatmalanu - Krushinchi Poyedu Sanghamulu
Jeevamondi Ujjeevamondagaa - Sadayudesunaku Samarpinchuchoo
|| Yesu ||
2)
Mahopakaaruni Marachitivaa? - Ihaana Neepani Marachitivaa ?
Ahoraavamuto Agniki Poyedu - Anyajanula Rakshinpalemmika
|| Yesu ||
3)
Yehova Panikai Yauvvanudaa! - Sahaaya Padedu Samayamide
Apaayakaalamu Aalasinpadu - Krupaakaalame Krushi Cheyumika
|| Yesu ||
4)
Raajulaina Yaajakulaaraa - Tejarilludee Lokamulo
Kreestu Mahimakai Kreestu Ghanatakai - Kreestu Koraku Jeevinpalemmika
|| Yesu ||
5)
Kreestuni Sanghama Melkonumaa - Korukonenu Ninu Sreeyesudu
Teri Choodudee Pradesamantayu - Tejarilla Nee Valla Naunugaa
|| Yesu ||
Present