Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 653 Old No: 278

ఒడ్డుచేరి నీ యెదుట

Odducheri Nee Yeduta

Open in Word & Worship App
తెలుగు   ఒడ్డుచేరి నీ యెదుట
పల్లవి
ఒడ్డుచేరి నీ యెదుట - నిల్చునపుడు రక్షకా
ఒక్కయాత్మనైన తేక - సిగ్గుపడి పోదునా
ఒక్క యాత్మనైన నేను - రక్షింపక యేసువా
వట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా
1)
ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్‌
వ్యర్థపరచు వారానాడు - చింతతోడ నిల్తురు
|| ఒక్క ||
2)
యేసువా! నా స్వరక్షణ - నిశ్చయంబు యైనదే
ఐన ఫలితంబు జూడ - కష్టపడనైతినే
|| ఒక్క ||
3)
కాలమెల్ల గడ్చిపోయెన్‌ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను రాదది
|| ఒక్క ||
4)
భక్తులారా! ధైర్యంతోడ - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసు నొద్ద - చేరునట్టు చేయుడి
|| ఒక్క ||
English   Odducheri Nee Yeduta
Chorus
Odducheri Nee Yeduta - Nilchunapudu Rakshakaa
Okkayaatmanaina Teka - Siggupadi Podunaa
Okka Yaatmanaina Nenu - Rakshinpaka Yesuvaa
Vatti Chetulato Ninnu - Darsinchuta Tagunaa
1)
Aatmalandu Vaanchaleka - Somarulai Kaalamun
Vyarthaparachu Vaaraanaadu - Chintatoda Nilturu
|| Okka ||
2)
Yesuvaa! Naa Svarakshana - Nischayanbu Yainade
Aina Phalitanbu Jooda - Kashtapadanaitine
|| Okka ||
3)
Kaalamella Gadchipoyen - Mosapoti Nenayyo
Gadchinatti Kaalamaite - edchinanu Raadadi
|| Okka ||
4)
Bhaktulaaraa! Dhairyantoda - Lechi Prakaasinchudee
Aatmalella Yesu Nodda - Cherunattu Cheyudi
|| Okka ||
Present