Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 65 Old No: 590

వందనములివే ప్రభో

Vamdanamulive Prabho

♪ M.A.Prasadrao
Open in Word & Worship App
తెలుగు   వందనములివే ప్రభో
పల్లవి
వందనము లివే ప్రభో - అందుకొనుము మా దేవా
సుందర వదన వరుడా - మాదు ప్రేమ ఇదే గొనుమా
1)
పాపాత్ములమగు మాకై - పరలోక మహిమ వీడి
భువి కరుదెంచిన ప్రభువా - మాదు స్తుతులివే గొనుమా
|| వంద ||
2)
ధనవంతుడవగు ప్రభూ - దరిద్రుడవైతివి మాకై
పరమైశ్వర్యము నొసగితివి - నీకృప నెట్టుల మరతుం
|| వంద ||
3)
మహిలో నెవరిని ప్రభూ - నీకు సాటి జేతు మహో
అన్ని నానమములకన్న - అత్యున్నతమగు మా యేసూ
|| వంద ||
4)
సిలువలో నీ రక్తము - చిందించి కలుషము కడిగి
పరిశుద్ధత దయచేసితివి - పరమ ప్రభో నిను గొలుతు
|| వంద ||
5)
మరణించి ప్రభుయేసూ - మూడవ దినమున లేచి
పరలోకమునకు వెళ్ళితివి - ప్రధాన యాజకుడవుగా
|| వంద ||
6)
మరలా త్వరగా వచ్చి - మహిమలో మమ్మును జేర్చి
పరమానందము నిచ్చెదవు - హల్లెలూయ నీకే, క్రీస్తు ప్రభూ
|| వంద ||
English   Vamdanamulive Prabho
Chorus
Vandanamu Live Prabho - Andukonumu Maa Devaa
Sundara Vadana Varudaa - Maadu Prema Ide Gonumaa
1)
Paapaatmulamagu Maakai - Paraloka Mahima Veedi
Bhuvi Karudenchina Prabhuvaa - Maadu Stutulive Gonumaa
|| Vanda ||
2)
Dhanavantudavagu Prabhoo - Daridrudavaitivi Maakai
Paramaisvaryamu Nosagitivi - Neekrupa Nettula Maratun
|| Vanda ||
3)
Mahilo Nevarini Prabhoo - Neeku Saati Jetu Maho
Anni Naanamamulakanna - Atyunnatamagu Maa Yesoo
|| Vanda ||
4)
Siluvalo Nee Raktamu - Chindinchi Kalushamu Kadigi
Parisudhata Dayachesitivi - Parama Prabho Ninu Golutu
|| Vanda ||
5)
Maraninchi Prabhuyesoo - Moodava Dinamuna Lechi
Paralokamunaku Vellitivi - Pradhaana Yaajakudavugaa
|| Vanda ||
6)
Maralaa Tvaragaa Vachchi - Mahimalo Mammunu Jerchi
Paramaanandamu Nichchedavu - Hallelooya Neeke, Kreestu Prabhoo
|| Vanda ||
Present