Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 644 Old No: 770

నశించు ఆత్మలను రక్షించే

Nashinchu Aatmalanu Rakshinche

Open in Word & Worship App
తెలుగు   నశించు ఆత్మలను రక్షించే
పల్లవి
నశియించె ఆత్మలను రక్షించే భారము నీదే ప్రియుడా!
1)
నాశన గోతికి జోగెడు పాపుల బాధలు తలపవదేల ?
ఈ సంగతి నాకేమియు లేదని సాకులు చెప్పుట యేలా?
నిను రక్షింపను నీ ప్రభుయేసు సిలువలో బలికాలేదా?
ఆ ప్రభు ప్రేమ నీలో లేదా? ఋజువును చేయవదేలా?
|| నశి ||
2)
హతమై పోయె జనులను గూర్చి సతతము దేవుని వేడన్‌
తలజలమయమై కన్నీళ్లూటగ కార్చెను యిర్మియనాడు
ఉపవాసముతో జాగరణములతో పౌలయ బలికాలేదా?
లోకసుఖాలు కోరెడు సోదరా! నీపని సరికాదోయి
|| నశి ||
3)
మేలును చేయగ నెరిగియు చేయక కాలము గడుపుట పాపం
మన ప్రభురాకడ రేపో మాపో రానైయున్నది చూడు
తరుణము దాటిన ప్రాణము పోయిన చేయునదేమియు లేదు
లోకరక్షకుని వార్తను చాటను నేడే వెళ్ళుట మేలు
|| నశి ||
4)
నీతి మార్గమున నడువననేకుల త్రిప్పుచున్న సోదరులే
బుద్ధిమంతులై ఆకాశములో జ్యోతులన్‌ బోలిన వారై
నిరతము ప్రకాశించుచునుందురు నిజమే దేవుని వాక్యం
పఠియించుమురా ప్రార్థించుమురా
ప్రకటించుము ప్రభు ప్రేమన్
|| నశి ||
English   Nashinchu Aatmalanu Rakshinche
Chorus
Nasiyinche Aatmalanu Rakshinche Bhaaramu Neede Priyudaa!
1)
Naasana Gotiki Jogedu Paapula Baadhalu Talapavadela ?
Ee Sangati Naakemiyu Ledani Saakulu Chepputa Yelaa?
Ninu Rakshinpanu Nee Prabhuyesu Siluvalo Balikaaledaa?
Aa Prabhu Prema Neelo Ledaa? Rjuvunu Cheyavadelaa?
|| Nasi ||
2)
Hatamai Poye Janulanu Goorchi Satatamu Devuni Vedan
Talajalamayamai Kanneellootaga Kaarchenu Yirmiyanaadu
Upavaasamuto Jaagaranamulato Paulaya Balikaaledaa?
Lokasukhaalu Koredu Sodaraa! Neepani Sarikaadoyi
|| Nasi ||
3)
Melunu Cheyaga Nerigiyu Cheyaka Kaalamu Gaduputa Paapam
Mana Prabhuraakada Repo Maapo Raanaiyunnadi Choodu
Tarunamu Daatina Praanamu Poyina Cheyunademiyu Ledu
Lokarakshakuni Vaartanu Chaatanu Nede Velluta Melu
|| Nasi ||
4)
Neeti Maargamuna Naduvananekula Trippuchunna Sodarule
Buddhimantulai Aakaasamulo Jyotulan Bolina Vaarai
Niratamu Prakaasinchuchununduru Nijame Devuni Vaakyam
Pathiyinchumuraa Praarthinchumuraa
Prakatinchumu Prabhu Preman
|| Nasi ||
Present