తెలుగు దైవజనుడా పరిచారకుడా
పల్లవిదైవజనుడా పరిచారకుడా సత్యవాక్యము చాటించుమా
ప్రకటించుమా - ప్రయాసపడుమా
సమయమందు - అసమయమందు
1)అగ్నివంటి శ్రమ లెదురైనను నా - దేవుడు రక్షించు సమర్థుడని
షద్రకు మెషాకు అబెద్నగోవలె - ధైర్యముగా యేసువార్త చాటుమా
|| ప్రక ||
2)దేవుని కృపాసువార్త చాటనే - సాక్ష్యమిచ్చుటలో నీపరుగున్
పౌలువలె తుదముట్టింపవా నీ - ప్రాణమును ప్రియముగ ఎంచక
|| ప్రక ||
3)గతించు ఈ పాపలోకమందు - నశించు ఆత్మల రక్షణకై
ఎస్తేరువలె ప్రయాసపడుమా - నశయించిన నశింతునని
|| ప్రక ||
4)సువార్త ద్వారము తెరచి ఉంది - సమయము సద్వినియోగించు
క్రీస్తేసు వలె మాదిరి చూపి - సిలువను మోయుమాక్రీస్తు దాసుడా
|| ప్రక ||
English Daivajanuudaa Parichaarakudaa
ChorusDaivajanudaa Parichaarakudaa Satyavaakyamu Chaatinchumaa
Prakatinchumaa - Prayaasapadumaa
Samayamandu - Asamayamandu
1)Agnivanti Srama Ledurainanu Naa - Devudu Rakshinchu Samarthudani
Shadraku Meshaaku Abednagovale - Dhairyamugaa Yesuvaarta Chaatumaa
|| Praka ||
2)Devuni Krupaasuvaarta Chaatane - Saakshyamichchutalo Neeparugun
Pauluvale Tudamuttinpavaa Nee - Praanamunu Priyamuga Enchaka
|| Praka ||
3)Gatinchu Ee Paapalokamandu - Nasinchu Aatmala Rakshanakai
Esteruvale Prayaasapadumaa - Nasayinchina Nasintunani
|| Praka ||
4)Suvaarta Dvaaramu Terachi Undi - Samayamu Sadviniyoginchu
Kreestesu Vale Maadiri Choopi - Siluvanu Moyumaakreestu Daasudaa
|| Praka ||