తెలుగు యేసుని ప్రేమ యేసు
పల్లవియేసుని ప్రేమ - యేసు వార్త - వాసిగ చాటను వెళ్ళుదమా
ఆశతో యేసు సజీవ సాక్షులై - దిశలన్నిటను వ్యాపించెదమా
వినుమా ప్రభుని స్వరము - ప్రభుయేసు సన్నిధి తోడురాగా -
కడుదూర తీరాలు చేరెదమా
1)మరణచ్ఛాయ లోయలలో - నాశన కూపపు లోతులలో
చితికిన బ్రతుకులెన్నో - ప్రేమతోడను చేరి వారిని
ప్రభుయేసు కొరకై గెలిచెదమా
|| యేసుని ||
2)కాపరి లేని గొర్రెలుగా - వేసారెను సమూహములే
ప్రజలను చూచెదమా - ప్రేమతోడను చేరి వారిని
ప్రభుయేసు కొరకై గెలిచెదమా
|| యేసుని ||
3)లేలేమ్ము రారమ్ము - మాసి దోనియుని పిలుపదిగో
వేగమే వెళ్ళుదమా - ప్రేమతోడ చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదమా
|| యేసుని ||
4)తెలియని వారు చూచెదరు - వినలేనివారు గ్రహించెదరు
వాగ్ధాన మూలముగా - క్రీస్తు నామము ఎరుగని వారికి
ప్రభు యేసు ప్రేమను - చాటెదము
|| యేసుని ||
English Yesuni Prema Yesu
ChorusYesuni Prema - Yesu Vaarta - Vaasiga Chaatanu Velludamaa
Aasato Yesu Sajeeva Saakshulai - Disalannitanu Vyaapinchedamaa
Vinumaa Prabhuni Svaramu - Prabhuyesu Sannidhi Toduraagaa -
Kadudoora Teeraalu Cheredamaa
1)Maranachchaaya Loyalalo - Naasana Koopapu Lotulalo
Chitikina Bratukulenno - Prematodanu Cheri Vaarini
Prabhuyesu Korakai Gelichedamaa
|| Yesuni ||
2)Kaapari Leni Gorrelugaa - Vesaarenu Samoohamule
Prajalanu Choochedamaa - Prematodanu Cheri Vaarini
Prabhuyesu Korakai Gelichedamaa
|| Yesuni ||
3)Lelemmu Raarammu - Maasi Doniyuni Pilupadigo
Vegame Velludamaa - Prematoda Cheri Vaarini
Prabhu Yesu Korakai Gelichedamaa
|| Yesuni ||
4)Teliyani Vaaru Choochedaru - Vinalenivaaru Grahinchedaru
Vaagdhaana Moolamugaa - Kreestu Naamamu Erugani Vaariki
Prabhu Yesu Premanu - Chaatedamu
|| Yesuni ||