తెలుగు సైనికులం పరిచారకులం
పల్లవిసైనికులం పరిచారకులం - దైవికమగు వ్యవసాయకులం
1)మనతండ్రి వ్యవసాయకుడు - మనమే దేవుని వ్యవసాయం
సంఘమే ప్రభు నాటిన తోట - చెరుగును ప్రభుచేతిలో చేట
|| సైని ||
2)ఆది కృషీవలుడాదాము - ఏదేను నేలను దున్నెనుగా
తుదియాదామగు ప్రభు వీపున్ - హృదయము లేకయే దున్నిరిగా
|| సైని ||
3)విని గ్రహియింపని వాడొకడు - విని నిలిచియు పడువాడొకడు
వినియును అణగెడు వాడొకడు - విని ఫలియించును వేరొకడు
|| సైని ||
4)త్రోవకు ప్రక్కన యుండముగా - రాతిని పోలియుండముగా
మనల నణచే పొద నెరుగుదుము - మంచిగ ఏపుగా పెరుగుదము
|| సైని ||
5)తోటను తడిపిన నది యేది - నీటిని పోలిన వాక్యమెగా
నాలుగు చీలిక లెందులకు - నలుదిక్కుల నరజాతులకు
|| సైని ||
6)పిడికెడు విత్తులు విత్తెదమా - పనలను మోతుము ఫలితముగా
కన్నీటితో కృషి చేయుదమా - ఎన్నో కోతుము మోదముగా
|| సైని ||
7)క్రమముగ ఆదాముతో మొదలు - హేబెలు నోవహు లంతా
ఇస్సాకు ఎలీషాలు - గిద్యోనులతో మనమంతా
|| సైని ||
English Sainikulum Parichaarakulum
ChorusSainikulan Parichaarakulan - Daivikamagu Vyavasaayakulam
1)Manatandri Vyavasaayakudu - Maname Devuni Vyavasaayam
Sanghame Prabhu Naatina Tota - Cherugunu Prabhuchetilo Cheta
|| Saini ||
2)Aadi Krusheevaludaadaamu - edenu Nelanu Dunnenugaa
Tudiyaadaamagu Prabhu Veepun - Hrudayamu Lekaye Dunnirigaa
|| Saini ||
3)Vini Grahiyinpani Vaadokadu - Vini Nilichiyu Paduvaadokadu
Viniyunu Anagedu Vaadokadu - Vini Phaliyinchunu Verokadu
|| Saini ||
4)Trovaku Prakkana Yundamugaa - Raatini Poliyundamugaa
Manala Nanache Poda Nerugudumu - Manchiga epugaa Perugudamu
|| Saini ||
5)Totanu Tadipina Nadi Yedi - Neetini Polina Vaakyamegaa
Naalugu Cheelika Lendulaku - Naludikkula Narajaatulaku
|| Saini ||
6)Pidikedu Vittulu Vittedamaa - Panalanu Motumu Phalitamugaa
Kanneetito Krushi Cheyudamaa - Enno Kotumu Modamugaa
|| Saini ||
7)Kramamuga Aadaamuto Modalu - Hebelu Novahu Lantaa
Issaaku Eleeshaalu - Gidyonulato Manamantaa
|| Saini ||