Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 632 Old No: 298

మధురమధుర మధుర సేవ

Madhura Madhura Madhura Seva

Open in Word & Worship App
తెలుగు   మధురమధుర మధుర సేవ
పల్లవి
మధుర మధుర మధుర సేవ - యేసు ప్రభుని సేవ
1)
దేవ దూతలకును లేని - దైవజనుని సేవ
దేవసుతుని సంఘ సేవ - దివ్యమౌ సువార్త సేవ
|| మధుర ||
2)
పరిశుద్ధాత్మ ప్రోక్షణచే - ప్రజ్వరిల్లు సేవ
పరిమళించు వాక్య - సేవ - ప్రతిఫలించు సాక్ష్య సేవ
|| మధుర ||
3)
ప్రభుని పేర ప్రజల ఎదుట - ప్రవచనాల సేవ
ప్రజల పేర ప్రభుని ఎదుట - ప్రార్థనలు వచించు సేవ
|| మధుర ||
4)
భోగ భాగ్య నిధులు లేని - భార భరిత సేవ
భాష్ప సిరులలోన మెలగి - బాధలను భరించు సేవ
|| మధుర ||
5)
సిలువ మూర్తి కృపలు జాట - సిగ్గు పడని సేవ
సిలువ నిందలను భరింప - శిరము వంచి మురియు సేవ
|| మధుర ||
6)
లోకజ్ఞాని యపహసించు - శోకమూర్తి సేవ
లోకులను దీవించు సేవ - లోకమును జయించు సేవ
|| మధుర ||
7)
దైవజనుడ మరువకోయి - దైవ పిలుపు నోయి
దైవ నీతి వదలకోయి - దేవుడు దీవించునోయి
|| మధుర ||
English   Madhura Madhura Madhura Seva
Chorus
Madhura Madhura Madhura Seva - Yesu Prabhuni Seva
1)
Deva Dootalakunu Leni - Daivajanuni Seva
Devasutuni Sangha Seva - Divyamau Suvaarta Seva
|| Madhura ||
2)
Parisudhaatma Prokshanache - Prajvarillu Seva
Parimalinchu Vaakya - Seva - Pratiphalinchu Saakshya Seva
|| Madhura ||
3)
Prabhuni Pera Prajala Eduta - Pravachanaala Seva
Prajala Pera Prabhuni Eduta - Praarthanalu Vachinchu Seva
|| Madhura ||
4)
Bhoga Bhaagya Nidhulu Leni - Bhaara Bharita Seva
Bhaashpa Sirulalona Melagi - Baadhalanu Bharinchu Seva
|| Madhura ||
5)
Siluva Moorti Krupalu Jaata - Siggu Padani Seva
Siluva Nindalanu Bharinpa - Siramu Vanchi Muriyu Seva
|| Madhura ||
6)
Lokagnaani Yapahasinchu - Sokamoorti Seva
Lokulanu Deevinchu Seva - Lokamunu Jayinchu Seva
|| Madhura ||
7)
Daivajanuda Maruvakoyi - Daiva Pilupu Noyi
Daiva Neeti Vadalakoyi - Devudu Deevinchunoyi
|| Madhura ||
Present