తెలుగు మనమెవ్వరం సైనికులం
పల్లవిమనమెవరం సైనికులం - మరి యెవరం పరిచారకులం
1)కడుగను దాసుల పాదములు - పోసెను ఉదకము పళ్లెములో
కడుగను దోషుల పాపములు - కార్చెను రుధిరము కలువరిలో
|| మన ||
2)దిగుపోతున్న ప్రయాణికులం - పడియుండిన కొర ప్రాణికులం
సమరయునికి ప్రియ స్నేహితులం - పరలోకపు జనకుని సుతులం
|| మన ||
3)మందిరమును కాచెడివారం - మందసమును మోసెడివారం
మందను మేపెడి కాపరులం - మందిర సేవలో నేర్పరులం
|| మన ||
4)దేవుని గృహములో సేవకులం - దేనారములకు వారసులం
బానలు నింపెడి బోధకులం - బాగుగ ఏలెడి పాలకులం
|| మన ||
5)ధూపము వేసెడి యాజకులం - ద్వారము తీసెడి పాలకులం
స్తుతులను సలిపెడి గాయకులం - రకరకముల పరిచారకులం
|| మన ||
6)పరిశుద్ధతయే ప్రాధాన్యం - సంసిద్ధతయే ప్రాముఖ్యం
నమ్మకమే మన పరిలక్ష్యం - నమ్రతయే మన నిజ లక్ష్యం
|| మన ||
7)మోషే యెహోషువలె - పౌలు తిమోతి మార్కువలె
లూదియ ఫీబే మార్తవలె - మాదిరులగు తదితరులవలె
|| మన ||
English Manamevvaram Sainikulum
ChorusManamevaran Sainikulan - Mari Yevaran Parichaarakulam
1)Kaduganu Daasula Paadamulu - Posenu Udakamu Pallemulo
Kaduganu Doshula Paapamulu - Kaarchenu Rudhiramu Kaluvarilo
|| Mana ||
2)Digupotunna Prayaanikulan - Padiyundina Kora Praanikulam
Samarayuniki Priya Snehitulan - Paralokapu Janakuni Sutulan
|| Mana ||
3)Mandiramunu Kaachedivaaran - Mandasamunu Mosedivaaram
Mandanu Mepedi Kaaparulan - Mandira Sevalo Nerparulan
|| Mana ||
4)Devuni Gruhamulo Sevakulan - Denaaramulaku Vaarasulam
Baanalu Ninpedi Bodhakulan - Baaguga eledi Paalakulan
|| Mana ||
5)Dhoopamu Vesedi Yaajakulan - Dvaaramu Teesedi Paalakulam
Stutulanu Salipedi Gaayakulan - Rakarakamula Parichaarakulan
|| Mana ||
6)Parisudhataye Praadhaanyan - Sansidhataye Praamukhyam
Nammakame Mana Parilakshyan - Namrataye Mana Nija Lakshyan
|| Mana ||
7)Moshe Yehoshuvale - Paulu Timoti Maarkuvale
Loodiya Pheebe Maartavale - Maadirulagu Taditarulavale
|| Mana ||