Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 63 Old No: 536

అసమానుడగు ఓ క్రీస్తు

Asamaanudagu O Kreestu

Open in Word & Worship App
తెలుగు   అసమానుడగు ఓ క్రీస్తు
పల్లవి
అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమెగ (2) నీవే ప్రభువా (2)
1)
ఇహ పరములలో నీ జన్మ - మహానందము కలిగించె
అభయము నిచ్చి మాకు - భయ భీతిని బాపితివి (2)
|| అస ||
2)
నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికీ
పావనడా ప్రభుయేసు - అవనికి మాదిరి నీవే
|| అస ||
3)
మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్‌ ఓడించి - నీతిగా మము తీర్చితివి
|| అస ||
4)
పాప శాపముల బాపితివి - చూపితివే పరమదారి
శక్తి గల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
|| అస ||
5)
విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
|| అస ||
6)
సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుడా - సర్వ మహిమ నీకే
|| అస ||
English   Asamaanudagu O Kreestu
Chorus
Asamaanundagu O Kreestu - Adviteeyundagu Devaa
Alphaayu Omega (2) Neeve Prabhuvaa (2)
1)
Iha Paramulalo Nee Janma - Mahaanandamu Kaliginche
Abhayamu Nichchi Maaku - Bhaya Bheetini Baapitivi (2)
|| Asa ||
2)
Nee Jeevita Vaakkulanni - Sajeevamu Janulandarikee
Paavanadaa Prabhuyesu - Avaniki Maadiri Neeve
|| Asa ||
3)
Maranamu Gelchina Maa Prabhuvaa - Parama Devudavu Neeve
Saataanun Odinchi - Neetigaa Mamu Teerchitivi
|| Asa ||
4)
Paapa Saapamula Baapitivi - Choopitive Paramadaari
Sakti Gala O Prabhuvaa - Neeke Maa Stotramulu
|| Asa ||
5)
Visvamantata O Devaa - Saasvatamainadi Nee Prema
Gnaanamunaku Minchinadi - Unnatamaina Prema
|| Asa ||
6)
Sanghamunaku Sirassu Neeve - Angamuluga Mamu Jesitivi
Sarva Sanpoornudaa - Sarva Mahima Neeke
|| Asa ||
Present