Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 629 Old No: 291

జీవనజ్యోతి పావనమూర్తి

Jeevanajyothi Paavanamuurthi

Open in Word & Worship App
తెలుగు   జీవనజ్యోతి పావనమూర్తి
పల్లవి
జీవన జ్యోతి పావన మూర్తి మా ముక్తిదాత యేసు ప్రభూ
అతులిత భక్తిఁ అనురాగశక్తిన్‌ - అనిశము నిన్నే సేవింతుము
1)
మము నిర్మించినరీతి చూడగా - మేము మంటివారమేగా - ఆ - ఆ
మంటిని మహిమకు మార్చిన దేవా - మహిమఘనత నీకె ప్రభూ
|| జీ ||
2)
మా దోషములను కడిగివేసి - నిర్దోషులుగా చేసితివే
రక్షణ నొసగి శిక్షను బాపి - మోక్షభాగ్యము నిచ్చితివే
|| జీ ||
3)
వ్యాధి బాధలు శోధన కల్గిన - అదరక నీదరి చేరెదము
అగ్నివంటి శ్రమలే కల్గిన - ఆశ్రయ దుర్గము నీవె ప్రభూ
|| జీ ||
4)
మా శత్రువు సాతానును గెల్చి - పాతాళమునకు త్రొక్కితివే
నీవే మాకు అండగ నుండ - మాకు విరోధి ఎవడు ప్రభూ
|| జీ ||
5)
మహాదేవుడా మహోన్నతుడా - మదిలో నిన్నే కొలుతుమయా
సర్వాధిపతి సర్వేశుడవు - సతతము నిన్నే సేవింతుము
|| జీ ||
English   Jeevanajyothi Paavanamuurthi
Chorus
Jeevana Jyoti Paavana Moorti Maa Muktidaata Yesu Prabhoo
Atulita Bhaktin Anuraagasaktin - Anisamu Ninne Sevintumu
1)
Mamu Nirminchinareeti Choodagaa - Memu Mantivaaramegaa - Aa - Aa
Mantini Mahimaku Maarchina Devaa - Mahimaghanata Neeke Prabhoo
|| Jee ||
2)
Maa Doshamulanu Kadigivesi - Nirdoshulugaa Chesitive
Rakshana Nosagi Sikshanu Baapi - Mokshabhaagyamu Nichchitive
|| Jee ||
3)
Vyaadhi Baadhalu Sodhana Kalgina - Adaraka Needari Cheredamu
Agnivanti Sramale Kalgina - Aasraya Durgamu Neeve Prabhoo
|| Jee ||
4)
Maa Satruvu Saataanunu Gelchi - Paataalamunaku Trokkitive
Neeve Maaku Andaga Nunda - Maaku Virodhi Evadu Prabhoo
|| Jee ||
5)
Mahaadevudaa Mahonnatudaa - Madilo Ninne Kolutumayaa
Sarvaadhipati Sarvesudavu - Satatamu Ninne Sevintumu
|| Jee ||
Present