Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 627 Old No: 288

పరమ జాలరి యేసు ప్రభువే

Parama Jaalari Yesu Prabhuve

Open in Word & Worship App
తెలుగు   పరమ జాలరి యేసు ప్రభువే
పల్లవి
పరమ జాలరి యేసు ప్రభువే - వాక్యమను వలవేయగా
దొరికితిమి ఆయనకు మనము - ధరలో సాక్ష్యంబీయగా
దొరికితిమి ఆయనకు మనము
1)
మనల మనుష్యుల బట్టు - జాలరులుగా జేసి
వాక్యమను వలయిచ్చి - తనతోడు మనకిచ్చె
జగమడెను జలములలో వలవేద్దాము జనములనే బడదాము
ప్రభువునకు - జయగీతములను బాడుదాము
|| పరమ ||
2)
లోబడి వుందాము - లోతునకు వెళదాము
లోపరహితంబుగ - ఆత్మ సహితంబుగా
లోకరక్షకుడేసుని మాటవిని - సువార్త వలవేద్దాము
ఆత్మచేయు కార్యంబులనే చూద్దాము
|| పరమ ||
3)
పెంతెకోస్తునాడు - పేతురు వలవేయ
దొరికెను ఆత్మలు - వేలకొలదిగాను
పౌలు తన జీవితమందు ఎందరినో - ప్రభుసన్నిధికి దెచ్చెను
ఆ పనికై ప్రాణంబులర్పించెను
|| పరమ ||
4)
చేపలను బట్టేటి జాలరులను బిలువంగా - జనములను
బట్టిరి జయజీవితముతోడ - జనములను బట్టవలసిన క్రైస్తవా
కడుపుకోసం - కాసులకే దాసుడగుటయే తగునా?
సోదరుడా మన ప్రభుకిది మహిమకరమగునా?
|| పరమ ||
5)
అపవాది వలలోని - అన్నదమ్ముల్లారా
అంధకారములోని అక్కాచెల్లెళ్ళారా
అందరికొరకు ప్రభువే తన రక్తమును - చిందించెను
సిలువలోనా నమ్మిన రక్షించు ఈ క్షణములోన
|| పరమ ||
English   Parama Jaalari Yesu Prabhuve
Chorus
Parama Jaalari Yesu Prabhuve - Vaakyamanu Valaveyagaa
Dorikitimi Aayanaku Manamu - Dharalo Saakshyanbeeyagaa
Dorikitimi Aayanaku Manamu
1)
Manala Manushyula Battu - Jaalarulugaa Jesi
Vaakyamanu Valayichchi - Tanatodu Manakichche
Jagamadenu Jalamulalo Valaveddaamu Janamulane Badadaamu
Prabhuvunaku - Jayageetamulanu Baadudaamu
|| Parama ||
2)
Lobadi Vundaamu - Lotunaku Veladaamu
Loparahitanbuga - Aatma Sahitanbugaa
Lokarakshakudesuni Maatavini - Suvaarta Valaveddaamu
Aatmacheyu Kaaryanbulane Chooddaamu
|| Parama ||
3)
Pentekostunaadu - Peturu Valaveya
Dorikenu Aatmalu - Velakoladigaanu
Paulu Tana Jeevitamandu Endarino - Prabhusannidhiki Dechchenu
Aa Panikai Praananbularpinchenu
|| Parama ||
4)
Chepalanu Batteti Jaalarulanu Biluvangaa - Janamulanu
Battiri Jayajeevitamutoda - Janamulanu Battavalasina Kraistavaa
Kadupukosan - Kaasulake Daasudagutaye Tagunaa?
Sodarudaa Mana Prabhukidi Mahimakaramagunaa?
|| Parama ||
5)
Apavaadi Valaloni - Annadammullaaraa
Andhakaaramuloni Akkaachellellaaraa
Andarikoraku Prabhuve Tana Raktamunu - Chindinchenu
Siluvalonaa Nammina Rakshinchu Ee Kshanamulona
|| Parama ||
Present