Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 625 Old No: 282

జీవితాంతము వరకు నీకే

Jeevitaantamu Varaku Neeke

Open in Word & Worship App
తెలుగు   జీవితాంతము వరకు నీకే
పల్లవి
జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము - నిచ్చినడుపుము రక్షకా
1)
ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన
అన్ని బోవును నీవు నా కడ - నున్న నిజమిది రక్షకా
|| జీవి ||
2)
అన్నివేళల నీవు చెంతనె - యున్న యనుభవమీయవె
తిన్నగా నీ మార్గమందున - పూని నడిచెద యేసువా
|| జీవి ||
3)
నేత్రములు మిరుమిట్లు గొలిపెడు - చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను - చాలు నీ కృప రక్షకా
|| జీవి ||
4)
నాదు హృదయమునందు - వెలుపట - నావరించిన వైరులన్‌
చెదరగొట్టుము రూపు మాపుము - శీఘ్రముగా నా రక్షకా
|| జీవి ||
5)
మహిమలో నీవుండుచోటికి - మమ్ము జేర్చెద నంటివే
ఇహము దాటినదాక నన్ను - వీడనంటివి రక్షకా
|| జీవి ||
6)
పాపమార్గము దరికి బోవక - పాతయాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ - కృప నొసంగుము రక్షకా
|| జీవి ||
English   Jeevitaantamu Varaku Neeke
Chorus
Jeevitaantamu Varaku Neeke - Seva Salpudunantini
Neevu Naato Nundi Dhairyamu - Nichchinadupumu Rakshakaa
1)
Enni Yaatankanbulunnanu - Enni Bhayamulu Kalgina
Anni Bovunu Neevu Naa Kada - Nunna Nijamidi Rakshakaa
|| Jeevi ||
2)
Annivelala Neevu Chentane - Yunna Yanubhavameeyave
Tinnagaa Nee Maargamanduna - Pooni Nadicheda Yesuvaa
|| Jeevi ||
3)
Netramulu Mirumitlu Golipedu - Chitradrusyamulunnanu
Satruvagu Saataanu Gelvanu - Chaalu Nee Krupa Rakshakaa
|| Jeevi ||
4)
Naadu Hrudayamunandu - Velupata - Naavarinchina Vairulan
Chedaragottumu Roopu Maapumu - Seeghramugaa Naa Rakshakaa
|| Jeevi ||
5)
Mahimalo Neevunduchotiki - Mammu Jercheda Nantive
Ihamu Daatinadaaka Nannu - Veedanantivi Rakshakaa
|| Jeevi ||
6)
Paapamaargamu Dariki Bovaka - Paatayaasala Goraka
Epudu Ninne Venbadinpaga - Krupa Nosangumu Rakshakaa
|| Jeevi ||
Present