తెలుగు సాక్ష్యమిచ్చెద మనస్వామి
పల్లవిసాక్ష్యమిచ్చెద - మన స్వామి యేసు దేవుఁడంచు
సాక్ష్య మనఁగఁ గనిన వినిన - సంగతులను దెల్పుటయే
సాక్ష్యమిచ్చు కొఱకు నన్ను - స్వామి రక్షించె నంచు
1)దిక్కు దెసయులేని నన్ను - దేవుఁడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు - మనశ్శాంతి నిచ్చినాఁడొ
|| సాక్ష్య ||
2)పల్లెటూళ్ళ జనుల రక్షణ - భారము నాపైని గలదు
పిల్లలకును బెద్దలకును - బ్రేమతో నా స్వానుభవము
|| సాక్ష్య ||
3)బోధ చేయ లేను వాద - ములకుఁబోను నాకదేల
నాధుడేసు ప్రభుని గూర్చి - నాకుఁదెలిసినంత వరకు
|| సాక్ష్య ||
4)పాపులకును మిత్రుఁడంచు - బ్రాణ మొసఁగి లేచె నంచుఁ
బాపముల క్షమించు నంచుఁ - ప్రభుని విశ్వసించుఁడంచు
|| సాక్ష్య ||
5)చోరు లైన జారు లైనా - చారు లైన నెవ్వరైన
ఘోరపాపులైనఁ క్రీస్తు - కూర్మితో రక్షించునంచు
|| సాక్ష్య ||
6)పరమత దూషణము లేల - పరిహసించి పలుకు టేల
ఇరుగు పొరుగు వారికెల్ల - యేసుక్రీసు దేవుఁడంచు
|| సాక్ష్య ||
7)ఎల్లకాల మూరకుండ - నేల యాత్మ శాంతిలేక
తల్లడిల్లు వారలకును - తండ్రికుమారాత్మ పేర
|| సాక్ష్య ||
English Saakshyamiccheda Manasvaami
ChorusSaakshyamichcheda - Mana Svaami Yesu Devundanchu
Saakshya Manangan Ganina Vinina - Sangatulanu Delputaye
Saakshyamichchu Koraku Nannu - Svaami Rakshinche Nanchu
1)Dikku Desayuleni Nannu - Devundento Kanikarinchi
Makkuvato Naaku Netlu - Manassaanti Nichchinaando
|| Saakshya ||
2)Palletoolla Janula Rakshana - Bhaaramu Naapaini Galadu
Pillalakunu Beddalakunu - Bremato Naa Svaanubhavamu
|| Saakshya ||
3)Bodha Cheya Lenu Vaada - Mulakunbonu Naakadela
Naadhudesu Prabhuni Goorchi - Naakundelisinanta Varaku
|| Saakshya ||
4)Paapulakunu Mitrundanchu - Braana Mosangi Leche NanchuM
Baapamula Kshaminchu Nanchun - Prabhuni Visvasinchundanchu
|| Saakshya ||
5)Choru Laina Jaaru Lainaa - Chaaru Laina Nevvaraina
Ghorapaapulainan Kreestu - Koormito Rakshinchunanchu
|| Saakshya ||
6)Paramata Dooshanamu Lela - Parihasinchi Paluku Tela
Irugu Porugu Vaarikella - Yesukreesu Devundanchu
|| Saakshya ||
7)Ellakaala Moorakunda - Nela Yaatma Saantileka
Talladillu Vaaralakunu - Tandrikumaaraatma Pera
|| Saakshya ||