Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 614 Old No: 652

నేనేమైనా ప్రభువా

Nenemanaa Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   నేనేమైనా ప్రభువా
పల్లవి
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను - నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను
నేనే మై యున్నానో నీ దయవలనేనయ్య
నాకున్న వన్నియు నీ విచ్చిన వేనయ్యా
1)
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలికోరగ తెచ్చి నీకర్పించిన అబ్రాహాములా
|| నేనే ||
2)
సర్వము పోయినా శరీరము కుళ్ళినా నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆ యోబులా
|| నేనే ||
3)
నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నా కెంతో మేలు (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా - దయతో నన్ను గైకొనుమయ్యా
|| నేనే ||
English   Nenemanaa Prabhuvaa
Chorus
Nenemainaa Prabhuvaa Ninne Sthuthistaanu - Naakemunnaa Prabhuvaa Nee Karpistaanu
Nene Mai Yunnaano Nee Dayavalanenayya
Naakunna Vanniyu Nee Vichchina Venayyaa
1)
Leka Leka Vrudhaapyamandu ekaika Kumaaruni Ichchindi Neeve (2)
Ichchina Neeve Balikoraga Techchi Neekarpinchina Abraahaamulaa
|| Nene ||
2)
Sarvamu Poyinaa Sareeramu Kullinaa Naa Anuvaare Velivesinaa (2)
Aaptulantaa Satruvulaina Antamu Varaku Sahinchina Aa Yobulaa
|| Nene ||
3)
Naamattukaite Bratukuta Kreeste Chaavaite Adi Naa Kento Melu (2)
Idigo Nenu Unnaanayyaa - Dayato Nannu Gaikonumayyaa
|| Nene ||
Present