Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 611 Old No: 512

ఇదిగో దేవా నా జేవితం

Idigo Devaa Naa Jevitam

Open in Word & Worship App
తెలుగు   ఇదిగో దేవా నా జేవితం
పల్లవి
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం (2)
శరణం\... నీ చరణం (2)
1)
పలుమార్లు వైదొలిగినాను నీవిచ్చిన నిబంధన నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమా దేవా ఈ నా శేష జీవితం (2)
|| ఇదిగో ||
2)
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు (2)
నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయ నిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగా పనిచేయనిమ్ము (2)
ప్రతిచోట నీ సాక్షిగ ప్రభువా నన్నుండ నిమ్మయా(2)
|| ఇదిగో ||
3)
విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయ నేర్పు (2)
కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైన నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా (2)
నశించు ఆత్మలన్‌ నీ దరి చేర్చు కృప నిమ్మయా (2)
|| ఇదిగో ||
English   Idigo Devaa Naa Jevitam
Chorus
Idigo Devaa Naa Jeevitan Aapaada Mastakan Nee Kankitan (2)
Saranan\... Nee Charanan (2)
1)
Palumaarlu Vaidoliginaanu Neevichchina Nibandhana Nundi
Viluvaina Nee Divya Pilupuku Taginatlu Jeevinchanaiti (2)
Ayinaa Nee Premato Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumaa Devaa Ee Naa Sesha Jeevitan (2)
|| Idigo ||
2)
Nee Paadamula Chenta Cheri Nee Chittanbu Neneruga Nerpu (2)
Nee Hrudaya Bhaaranbu Nosagi Praarthinchi Panicheya Nimmu (2)
Aagipoka Saagipovu Priya Sutunigaa Panicheyanimmu (2)
Pratichota Nee Saakshiga Prabhuvaa Nannunda Nimmayaa(2)
|| Idigo ||
3)
Vistaara Panta Polamu Nundi Kashtinchi Panicheya Nerpu (2)
Kanneetito Vittu Manasu Kalakaalan Mari Naaku Nosagu (2)
Kshema Kshaama Kaalamaina Ninnu Ghanaparachu Bratuku Nimmayaa (2)
Nasinchu Aatmalan Nee Dari Cherchu Krupa Nimmayaa (2)
|| Idigo ||
Present