Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 605 Old No: 283

నావన్ని యంగీకరించుమి

Naavanni Yangeekarinchumi

Open in Word & Worship App
తెలుగు   నావన్ని యంగీకరించుమి
పల్లవి
నావన్ని యంగీకరించుమీ - దేవా - నన్నెపుడు నీవు
కరుణించుమీ - నావన్నీ కృపచేత - నీవలన నొందిన
భావంబునను నేను - బహు ధైర్యమొందెద
1)
నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి
నీకు మీఁదుగట్టి - నీ కొరకు నిల్పెద
|| నావన్నీ ||
2)
సత్యంబు నీ ప్రేమ - చక్కగా మదిఁబూని
నిత్యంబు గరముల - నీ సేవ జేసెద
|| నావన్నీ ||
3)
నీ సేవ జరిగెడు - నీయాలయమునకు
వాసచే నడిపించు - మరల నా పదములు
|| నావన్నీ ||
4)
పెదవులతో నేను - బెంపుగ నీ వార్త
గదలక ప్రకటింపఁ - గలిగించు దృఢ భక్తి
|| నావన్నీ ||
5)
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి
యావంతయై నను నాశింప మదిలోన
|| నావన్నీ ||
6)
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే
సేవ జేయఁగ నిమ్ము - స్థిర భక్తితో నీకు
|| నావన్నీ ||
7)
చిత్తము నీ కృపా - యత్తంబు గావించి
మత్తిల్లకుండఁగ - మార్గంబు దెలుపుము
|| నావన్నీ ||
8)
హృదయంబు నీకిత్తు - సదనంబుగావించి
పదిలంబుగా దానిఁ - బట్టి కాపాడుము
|| నావన్నీ ||
English   Naavanni Yangeekarinchumi
Chorus
Naavanni Yangeekarinchumee - Devaa - Nannepudu Neevu
Karuninchumee - Naavannee Krupacheta - Neevalana Nondina
Bhaavanbunanu Nenu - Bahu Dhairyamondeda
1)
Neeku Naa Praanamu - Nijamugaa Narpinchi
Neeku Meendugatti - Nee Koraku Nilpeda
|| Naavannee ||
2)
Satyanbu Nee Prema - Chakkagaa Madinbooni
Nityanbu Garamula - Nee Seva Jeseda
|| Naavannee ||
3)
Nee Seva Jarigedu - Neeyaalayamunaku
Vaasache Nadipinchu - Marala Naa Padamulu
|| Naavannee ||
4)
Pedavulato Nenu - Benpuga Nee Vaarta
Gadalaka Prakatinpan - Galiginchu Drudha Bhakti
|| Naavannee ||
5)
Naa Vendi Kanakanbu Naa Tandri Gaikonumi
Yaavantayai Nanu Naasinpa Madilona
|| Naavannee ||
6)
Neevu Naa Kosagina Nirmala Buddiche
Seva Jeyanga Nimmu - Sthira Bhaktito Neeku
|| Naavannee ||
7)
Chittamu Nee Krupaa - Yattanbu Gaavinchi
Mattillakundanga - Maarganbu Delupumu
|| Naavannee ||
8)
Hrudayanbu Neekittu - Sadananbugaavinchi
Padilanbugaa Daanin - Batti Kaapaadumu
|| Naavannee ||
Present