తెలుగు ముసలమ్మ ముచ్చట్లు
పల్లవిముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి
దీక్షతో నడుముకట్టి యింటింటి తలుపు తట్టి
యేసయ్య ఊసే చెప్పమ్మా\... ఊరకనే ఉంటే తప్పమ్మా\...
1)ఆయింటి సంగతులన్నీ - ఈ ఇంటికి మోసేవమ్మా
పొరిగింటి విషయాలన్నీ - చాటింపు వేసేవమ్మా
ఇక్కడి మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులే మానమ్మా\... చిచ్చు బెట్టబాకే చిన్నమ్మా
|| ముస ||
2)కల్పించిన కథలంటే - చెవి కోసుకుంటావమ్మా
చెడు మాటల సభలంటే - నువ్వే ముందుంటావమ్మా
విన్న దానికి కొసరు వేసి - ఉన్న దాన్ని మార్చేసి
కొండాలు చెప్పవద్దమ్మా\... జగడాలు పెట్టకు పెద్దమ్మా
|| ముస ||
3)మంచిగ ఉన్నోళ్లను చూస్తే - కళ్ళెర్ర చేస్తావమ్మా
హెచ్చింపు పడుతూ ఉంటే - అపనిందలు వేస్తావమ్మ
వ్యంగపు మాటల కత్తులు దూసి - చల్లని గుండెలు కోసి
గాయాలు చేయ్య వద్దమ్మా\... నోటికి ఉండాలి హద్దమ్మా
|| ముస ||
English Musalamma Muchhatlu
ChorusMusalamma Muchchatlu Kattipetti Parisudha Granthaanni Chetabatti
Deekshato Nadumukatti Yintinti Talupu Tatti
Yesayya Oose Cheppammaa\... Oorakane Unte Tappammaa\...
1)Aayinti Sangatulannee - Ee Intiki Mosevammaa
Poriginti Vishayaalannee - Chaatinpu Vesevammaa
Ikkadi Maatalu Akkada Cheppi - Manchini Chedugaa Tippi
Rechchagotte Panule Maanammaa\... Chichchu Bettabaake Chinnammaa
|| Musa ||
2)Kalpinchina Kathalante - Chevi Kosukuntaavammaa
Chedu Maatala Sabhalante - Nuvve Munduntaavammaa
Vinna Daaniki Kosaru Vesi - Unna Daanni Maarchesi
Kondaalu Cheppavaddammaa\... Jagadaalu Pettaku Peddammaa
|| Musa ||
3)Manchiga Unnollanu Chooste - Kallerra Chestaavammaa
Hechchinpu Padutoo Unte - Apanindalu Vestaavamma
Vyangapu Maatala Kattulu Doosi - Challani Gundelu Kosi
Gaayaalu Cheyya Vaddammaa\... Notiki Undaali Haddammaa
|| Musa ||