Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 598 Old No: 550

యువతులారా కూడి రండి

Yuvatulaaraa Koodi Randi

Open in Word & Worship App
తెలుగు   యువతులారా కూడి రండి
పల్లవి
యువతులారా కూడి రండి - ఆలకించండి
వనితలారా చేరి మీరు - ఆలోచించండి (2)
దేవుని మాటలు అంగీకరించి - మేలు పొందండి
1)
దేవుని ఎడల భయభక్తుల గల స్త్రీ కొనియాడబడును గదా (2)
అట్టి స్త్రీయే జ్ఞానము గలదై తన గృహమును కట్టును.
పరిశుద్ధతయే తన సౌందర్యము - విధేయతయే తన ఆభరణము
వాక్యమే తన ఆయుధము - ప్రార్థనే తనకున్న బలం
|| యువ ||
2)
జాతిని రక్షించ సాహసించెను రాణి ఎస్తేరు (2)
కన్య మరియ జనని ఆయె లోక రక్షకునికి (2)
విశ్వసించిన వేశ్య రాహాబు ఇంటివారిని రక్షించెగదా!
హృదయము తెరిచిన లూదియ గృహమే సంఘమాయెకదా!
|| యువ ||
3)
సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై
సంఘ సమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి (2)
క్రీస్తు రాజ్య స్థాపన చేయ యేసుతో కలిసి పోరును సలుప
వీరులను యోధులను స్త్రీలు పంపాలి
సంపదను సంతతిని అర్పణ చేయాలి
|| యువ ||
English   Yuvatulaaraa Koodi Randi
Chorus
Yuvatulaaraa Koodi Randi - Aalakinchandi
Vanitalaaraa Cheri Meeru - Aalochinchandi (2)
Devuni Maatalu Angeekarinchi - Melu Pondandi
1)
Devuni Edala Bhayabhaktula Gala Stree Koniyaadabadunu Gadaa (2)
Atti Streeye Gnaanamu Galadai Tana Gruhamunu Kattunu.
Parisudhataye Tana Saundaryamu - Vidheyataye Tana Aabharanamu
Vaakyame Tana Aayudhamu - Praarthane Tanakunna Balan
|| Yuva ||
2)
Jaatini Rakshincha Saahasinchenu Raani Esteru (2)
Kanya Mariya Janani Aaye Loka Rakshakuniki (2)
Visvasinchina Vesya Raahaabu Intivaarini Rakshinchegadaa!
Hrudayamu Terichina Loodiya Gruhame Sanghamaayekadaa!
|| Yuva ||
3)
Sanghamunaku Stanbhaalai Balamaina Angaalai
Sangha Samaikyata Vardhillutaku Streele Nilavaali (2)
Kreestu Raajya Sthaapana Cheya Yesuto Kalisi Porunu Salupa
Veerulanu Yodhulanu Streelu Panpaali
Sanpadanu Santatini Arpana Cheyaali
|| Yuva ||
Present