Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 597 Old No: 300

ప్రభు ప్రేమ తొలికక

Prabhu Prema Tolikaka

Open in Word & Worship App
తెలుగు   ప్రభు ప్రేమ తొలికక
పల్లవి
ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే
పాపక్షమా యేసునిలో శరణు నొసంగుచూ కనిపించె
1)
పాప వికారము పొడచూప - జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో - బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేక - దాహముతోనే నొంటరిగా
బావికనీ పయనింప - నాధుని దర్శన మెదురాయె
పావనుడు దాహముతో - జలమును యిమ్మని నను కోరె
|| ప్రభు ||
2)
జాతిని చూడని నేత్రముతో - పాపము సోకని హృదయముతో
జాలిని చాటించెగనె - తాకెను నా మది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియె - దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని - ప్రభు యెరిగిన నా నిజస్థితిని
జయమొందె నా తనువు - సరిగ నుడితివని ప్రభు తెలుప
|| ప్రభు ||
3)
పాపము దాగిన నా బావి - లోతును యెరిగిన వారెవరూ
పోరాట వాటికయౌ - నా బ్రతుకును జూచిన దెవరు
పాపికిని పాపమునకును - బేధము చూపిన వారెవరు
పాపిని రక్షించుటకై సిలువ ధరించిన వారెవరూ
పరదైసు ద్వారములు - ప్రేమతో తెరచెను నా కొరకై
|| ప్రభు ||
4)
దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింప
దినదినము జీవితము - చావుగా మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి
దరిజేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే
దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించె
|| ప్రభు ||
5)
ఘటముతో వెడలితి నొంటరిగా పితరులు త్రావిన జలములకై
కనబడెను బావికడ - రక్షణ యూటల ప్రభుయేసు
కుండను వీడి పరుగుడితి - బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుప
గ్రామప్రజ కనుగొనిరి - విశ్వవిమోచకుడగు యేసున్‌
|| ప్రభు ||
English   Prabhu Prema Tolikaka
Chorus
Prabhu Prema Tolikeka - Hrudayamulo Pratidhvaniyinche
Paapakshamaa Yesunilo Saranu Nosanguchoo Kanipinche
1)
Paapa Vikaaramu Podachoopa - Jeevita Viluvalu Marugaaye
Patitanugaa Lokamulo - Bratukutaye Naa Gatiyaaye
Paluvurilo Kanabadaleka - Daahamutone Nontarigaa
Baavikanee Payaninpa - Naadhuni Darsana Meduraaye
Paavanudu Daahamuto - Jalamunu Yimmani Nanu Kore
|| Prabhu ||
2)
Jaatini Choodani Netramuto - Paapamu Sokani Hrudayamuto
Jaalini Chaatinchegane - Taakenu Naa Madi Vedanato
Jaapyamu Cheyaka Temmaniye - Daachukonina Naa Paapamunu
Jadiyuchune Telipitini - Prabhu Yerigina Naa Nijasthitini
Jayamonde Naa Tanuvu - Sariga Nuditivani Prabhu Telupa
|| Prabhu ||
3)
Paapamu Daagina Naa Baavi - Lotunu Yerigina Vaarevaroo
Poraata Vaatikayau - Naa Bratukunu Joochina Devaru
Paapikini Paapamunakunu - Bedhamu Choopina Vaarevaru
Paapini Rakshinchutakai Siluva Dharinchina Vaarevaroo
Paradaisu Dvaaramulu - Premato Terachenu Naa Korakai
|| Prabhu ||
4)
Dehamune Naa Sarvamugaa - Bhaavinchuchu Madi Poojinpa
Dinadinamu Jeevitamu - Chaavugaa Maarina Kaalamulo
Devunigaa Naa Bandhuvugaa - Marana Pravaahamu Chedinchi
Darijerchi Deevinchi Nootana Janma Prasaadinche
Dayyaala Kuharamunu - Sthuthi Mandiramuga Roopinche
|| Prabhu ||
5)
Ghatamuto Vedaliti Nontarigaa Pitarulu Traavina Jalamulakai
Kanabadenu Baavikada - Rakshana Yootala Prabhuyesu
Kundanu Veedi Paruguditi - Baavini Chekoni Hrudayamulo
Ghanamaina Subhavaarta - Aatrutato Prajalaku Telupa
Graamapraja Kanugoniri - Visvavimochakudagu Yesun
|| Prabhu ||
Present