తెలుగు స్తుతియింతుము నిను
పల్లవిస్తుతియింతుము నిను దేవా యోహోవా - శ్రీ యేసారక్షణ కర్తా
జయము జయము మా జీవ ప్రదాత - సకల చరాచర సృష్టికర్త
1)ఆకాశము నీ సింహాసనము - భూలోకము నీ పాద పీఠము
మృత్యుంజయుడా సత్యస్వరూప - నిత్యము నిన్నే పూజించెదము
|| స్తుతి ||
2)కెరూపులు సెరూపులు నిను - చూడలేక ముఖము కప్పుకొందురు
దురవగాహమగు తేజో నివాసి - తండ్రి కుమార పవిత్రాత్మ రూపివి
|| స్తుతి ||
3)రాజులకు రారాజువు నీవు - దేవతలకు మహా దేవుడ నీవే
హీనులగు మానవులను గావ - దీనుడవై భువి జన్మించినావు
|| స్తుతి ||
4)దూరస్థులమై నేరస్తులమై - దండనకే తగి యుంటిమి మేము
మా శిక్షను ఆ సిలువలో మోసి - మము రక్షించిన మహోపకారి
|| స్తుతి ||
5)మాటతో సృష్టిని కలుగజేసితివి - మాటతో శవముకు జీవమిచ్చితివి మాటతో
పాప క్షమాపణ నివ్వన్ ప్రాణము సిలువలో ధారపోసితివి
|| స్తుతి ||
English Sthuthiyimtumu Ninu
ChorusSthuthiyintumu Ninu Devaa Yohovaa - Sree Yesaarakshana Kartaa
Jayamu Jayamu Maa Jeeva Pradaata - Sakala Charaachara Srushtikarta
1)Aakaasamu Nee Sinhaasanamu - Bhoolokamu Nee Paada Peethamu
Mrtyunjayudaa Satyasvaroopa - Nityamu Ninne Poojinchedamu
|| Sthuthi ||
2)Keroopulu Seroopulu Ninu - Choodaleka Mukhamu Kappukonduru
Duravagaahamagu Tejo Nivaasi - Tandri Kumaara Pavitraatma Roopivi
|| Sthuthi ||
3)Raajulaku Raaraajuvu Neevu - Devatalaku Mahaa Devuda Neeve
Heenulagu Maanavulanu Gaava - Deenudavai Bhuvi Janminchinaavu
|| Sthuthi ||
4)Doorasthulamai Nerastulamai - Dandanake Tagi Yuntimi Memu
Maa Sikshanu Aa Siluvalo Mosi - Mamu Rakshinchina Mahopakaari
|| Sthuthi ||
5)Maatato Srushtini Kalugajesitivi - Maatato Savamuku Jeevamichchitivi Maatato
Paapa Kshamaapana Nivvan Praanamu Siluvalo Dhaarapositivi
|| Sthuthi ||