Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 576 Old No: 259

అరుణోదయ దర్శనమొసగిన

Arunodaya Darshanamosagina

Open in Word & Worship App
తెలుగు   అరుణోదయ దర్శనమొసగిన
పల్లవి
అరుణోదయ దర్శన మొసగిన - కరుణామయా స్తోత్రముల్‌
మరణించి మరి తిరిగిలేచిన - శరణు శరణంటు నిను చేరితిమి
1)
గడచిన జీవితమంత - మెడవంచని బ్రతుకాయె వింత
అతుకుల గతుకుల బ్రతుకు - గతిలేని మతిలేని చితుకు
|| అ ||
2)
అసూయాయె మాలోమెండు - అనురాగం నీలోన నిండు
అనుచితమగు క్రియలను పిండు - అనురాగం మాలోన పండు
|| అ ||
3)
నిర్జీవం మాలోన మిన్న - ఉజ్జీవం మదిలోన సున్న
నిర్జీవ జ్వాలలను ఆర్పి - ఉజ్జీవ జ్వాలను రగిలింపు
|| అ ||
4)
కఠినత్వం మాలోన పెరిగె - కుటిలత్వం ఎదలోన ఎదిగె
జటిలత్వపు జాడ్యమును తుంచి - సాధుత్వము మాలోన పెంచు
|| అ ||
5)
శోధనలు జయించు శక్తి - బాధలను భరియించు భక్తి
కలిగించు సేవలో ఆసక్తి - ఒలికించు మాలో అనురక్తి
|| అ ||
6)
విశ్వాసమందువృద్ధి - ప్రేమించడంలో అభివృద్ధి
సచ్చీలతలో సమృద్ధి - సద యుండ మాకొసగు సిద్ధి
|| అ ||
English   Arunodaya Darshanamosagina
Chorus
Arunodaya Darsana Mosagina - Karunaamayaa Stotramul
Maraninchi Mari Tirigilechina - Saranu Saranantu Ninu Cheritimi
1)
Gadachina Jeevitamanta - Medavanchani Bratukaaye Vinta
Atukula Gatukula Bratuku - Gatileni Matileni Chituku
|| A ||
2)
Asooyaaye Maalomendu - Anuraagan Neelona Nindu
Anuchitamagu Kriyalanu Pindu - Anuraagan Maalona Pandu
|| A ||
3)
Nirjeevan Maalona Minna - Ujjeevan Madilona Sunna
Nirjeeva Jvaalalanu Aarpi - Ujjeeva Jvaalanu Ragilinpu
|| A ||
4)
Kathinatvan Maalona Perige - Kutilatvan Edalona Edige
Jatilatvapu Jaadyamunu Tunchi - Saadhutvamu Maalona Penchu
|| A ||
5)
Sodhanalu Jayinchu Sakti - Baadhalanu Bhariyinchu Bhakti
Kaliginchu Sevalo Aasakti - Olikinchu Maalo Anurakti
|| A ||
6)
Visvaasamanduvruddhi - Preminchadanlo Abhivruddhi
Sachcheelatalo Samrddhi - Sada Yunda Maakosagu Siddhi
|| A ||
Present