Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 575 Old No: 258

సహోదర ప్రేమ

Sahodara Prema

Open in Word & Worship App
తెలుగు   సహోదర ప్రేమ
పల్లవి
సహోదర ప్రేమ - సహోదర ఐక్యత
ఆహాహా బహుమేలు - మహామనోహరము
1)
ఆత్మచే ముద్రించితివి - ఆత్మతో బంధించు
ఆత్మీయ మందిరమందు - ఐక్యత కాపాడు ప్రభో
|| సహో ||
2)
ఏకాకులుగ నిలిచితిమి - చీకాకులతో సాకులతో
ఏకాత్మతో సేవింప - ఏక మనసు నొసగు ప్రభో
|| సహో ||
3)
ఆశ్రయ దుర్గము నీవే - శాశ్వత జీవము నీవే
సంఘంబునకు శిరసువై - సంపూర్ణత నిమ్ము ప్రభో
|| సహో ||
4)
ప్రాణమిచ్చి సంఘంబునకై ప్రాణేశ్వరిగ జేసితివే
ముడత కళంకము లేక - మహిమతో నిలుపుము ప్రభువా
|| సహో ||
5)
క్షేమాభివృద్ధికి సూత్రం - ప్రేమ సమాధానములు
ఆత్మఫలం - ఫలియింప - ఆశీస్సుల నిమ్ము ప్రభో
|| సహో ||
6)
వర్షించు దీవెన తోడ - దయగల మా ప్రియ ప్రభువా
దర్శించు దీవెన తోడ - దయగల మా ప్రియ ప్రభువా
|| సహో ||
7)
ఆంధ్ర అసెంబ్లీలందు - ఆరంభ ఐక్యత నిమ్ము
అభిషేక తైలము పగిది - అంచువరకు వంచు ప్రభో
|| సహో ||
English   Sahodara Prema
Chorus
Sahodara Prema - Sahodara Aikyata
Aahaahaa Bahumelu - Mahaamanoharamu
1)
Aatmache Mudrinchitivi - Aatmato Bandhinchu
Aatmeeya Mandiramandu - Aikyata Kaapaadu Prabho
|| Saho ||
2)
ekaakuluga Nilichitimi - Cheekaakulato Saakulato
ekaatmato Sevinpa - eka Manasu Nosagu Prabho
|| Saho ||
3)
Aasraya Durgamu Neeve - Saasvata Jeevamu Neeve
Sanghanbunaku Sirasuvai - Sanpoornata Nimmu Prabho
|| Saho ||
4)
Praanamichchi Sanghanbunakai Praanesvariga Jesitive
Mudata Kalankamu Leka - Mahimato Nilupumu Prabhuvaa
|| Saho ||
5)
Kshemaabhivruddhiki Sootran - Prema Samaadhaanamulu
Aatmaphalan - Phaliyinpa - Aaseessula Nimmu Prabho
|| Saho ||
6)
Varshinchu Deevena Toda - Dayagala Maa Priya Prabhuvaa
Darsinchu Deevena Toda - Dayagala Maa Priya Prabhuvaa
|| Saho ||
7)
Aandhra Asenbleelandu - Aaranbha Aikyata Nimmu
Abhisheka Tailamu Pagidi - Anchuvaraku Vanchu Prabho
|| Saho ||
Present