Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 57 Old No: 419

ఏమని వర్ణింతును ప్రభు

Emani Varnintunu Prabhu

♪ Sadhusuguna Rao
Open in Word & Worship App
తెలుగు   ఏమని వర్ణింతును ప్రభు
పల్లవి
ఏమని వర్ణింతును ప్రభు ఏమని కీర్తింతును
ఎంత వర్ణించిన తీరదు ఋణము
ఏ రీతి స్తుతియింతును - ప్రభు ఏమని వర్ణింతును
1)
ఎనలేని భాగ్యము విడనాడినావు - కనరానిదూరము అరుదెంచి -
నావు - దివినివిడచి దాసునిగా మారి -
దీనుడవై ధరనుజన్మించినావు
|| ఏమి ||
2)
అడవిలో జల్దరువృక్షమున్నట్లు - పురుషులలో నా ప్రియుడా
అట్టున్నావు - నీ ఫలము నా జిహ్వకు మధురం -
జిహ్వాఫలములు అర్పింతు నిరతం
|| ఏమి ||
3)
ధవళవర్ణుడ రత్నవర్ణుడ - పదివేల మందిలో అతిశ్రేష్ఠుడ
జుంటితేనెమించిన మాటల - మింటి ఆనందము నాకందించితివి
|| ఏమి ||
4)
మందను మేపే నా సుందరాంగుడ - పొందుగ విందుకు పిల్చిన
సఖుడ - విందులోనేను కూర్చొనియుండ సుందరమగు
ప్రేమజెండా నెత్తితివి
|| ఏమి ||
5)
ఇదిగో యేసయ్య వచ్చుచున్నావు - నీ స్వరము నాకు వినబడు
చున్నది - ఎగసిదాటుచు గంతులు వేయుచు - వేగముగా
వచ్చి నను చేర్చుకొందువు
|| ఏమి ||
English   Emani Varnintunu Prabhu
Chorus
emani Varnintunu Prabhu emani Keertintunu
Enta Varninchina Teeradu Runamu
e Reeti Sthuthiyintunu - Prabhu emani Varnintunu
1)
Enaleni Bhaagyamu Vidanaadinaavu - Kanaraanidooramu Arudenchi -
Naavu - Divinividachi Daasunigaa Maari -
Deenudavai Dharanujanminchinaavu
|| emi ||
2)
Adavilo Jaldaruvrukshamunnatlu - Purushulalo Naa Priyudaa
Attunnaavu - Nee Phalamu Naa Jihvaku Madhuran -
Jihvaaphalamulu Arpintu Niratan
|| emi ||
3)
Dhavalavarnuda Ratnavarnuda - Padivela Mandilo Atisreshthuda
Juntiteneminchina Maatala - Minti Aanandamu Naakandinchitivi
|| emi ||
4)
Mandanu Mepe Naa Sundaraanguda - Ponduga Vinduku Pilchina
Sakhuda - Vindulonenu Koorchoniyunda Sundaramagu
Premajendaa Nettitivi
|| emi ||
5)
Idigo Yesayya Vachchuchunnaavu - Nee Svaramu Naaku Vinabadu
Chunnadi - Egasidaatuchu Gantulu Veyuchu - Vegamugaa
Vachchi Nanu Cherchukonduvu
|| emi ||
Present