తెలుగు కూడుకొనియున్నాము
పల్లవికూడుకొని యున్నాము - సంఘ ప్రభో - కూడుకొని యున్నాము
తోడ నుండెద ననుచు నమ్ముచు - దొడ్డ దగు నీ పాద సన్నిధి
1)ఎచట నా ప్రియ భక్తు - లెలమిఁ గూడియున్న నచటికి నేతెంతు - నని పల్కితి
విచట నుండు మమ్ము - వీక్షించి కృపచేత - నిపుడు దీవించు మీ
యేసు క్రీస్తునాథా
|| కూడు ||
2)గత కాలమందున-గాని చేఁతలచే దు-ర్గతి నొంది యుండఁగాఁ-గనుఁగొంటివి
శత సంఖ్య గల పాప-చయ మీవు క్షమియించి-యతి శాంతి నిడితివి
యాత్మస్వరూపా
|| కూడు ||
3)నిరతము నీ ప్రేమ - నెనరున ధ్యానించి - పరమ ధర్మములందుఁ - బరతఁ గల్గి
యరులకు శుభములు - నిరతంబుఁ జేయఁగఁ - దిరత మా కొసఁగుము
దేవుని ప్రియ తనయా
|| కూడు ||
4)అన్ని శోధనముల - నన్ని విపత్తుల - నన్ని కాలములందు - నాదరించి
నిన్ను నమ్మిన జనుల - నీ సందిటను జేర్చి - పన్నుగఁ గాపాడు
ప్రభు యేసు క్రీస్తు
|| కూడు ||
5)అమలుఁడ నగు న - న్న నుకరించుం డనుచు - నాన తిచ్చినాఁడ - వాత్మజులకు
నమల మార్గము నందు - నరుగంగ మాకీవు - విమలాత్మ దయసేయు
వేగంబు మా తండ్రీ
|| కూడు ||
English Koodukoniyunnaamu
ChorusKoodukoni Yunnaamu - Sangha Prabho - Koodukoni Yunnaamu
Toda Nundeda Nanuchu Nammuchu - Dodda Dagu Nee Paada Sannidhi
1)Echata Naa Priya Bhaktu - Lelamin Goodiyunna Nachatiki Netentu - Nani Palkiti
Vichata Nundu Mammu - Veekshinchi Krupacheta - Nipudu Deevinchu Mee
Yesu Kreestunaathaa
|| Koodu ||
2)Gata Kaalamanduna-Gaani Chentalache Du-Rugati Nondi Yundangaan-Ganungontivi
Sata Sankhya Gala Paapa-Chaya Meevu Kshamiyinchi-Yati Saanti Niditivi
Yaatmasvaroopaa
|| Koodu ||
3)Niratamu Nee Prema - Nenaruna Dhyaaninchi - Parama Dharmamulandun - Baratan Galgi
Yarulaku Subhamulu - Niratanbun Jeyangan - Dirata Maa Kosangumu
Devuni Priya Tanayaa
|| Koodu ||
4)Anni Sodhanamula - Nanni Vipattula - Nanni Kaalamulandu - Naadarinchi
Ninnu Nammina Janula - Nee Sanditanu Jerchi - Pannugan Gaapaadu
Prabhu Yesu Kreestu
|| Koodu ||
5)Amalunda Nagu Na - Nna Nukarinchun Danuchu - Naana Tichchinaanda - Vaatmajulaku
Namala Maargamu Nandu - Naruganga Maakeevu - Vimalaatma Dayaseyu
Veganbu Maa Tandree
|| Koodu ||