తెలుగు ఓ సంఘమా సర్వాంగమా
పల్లవిఓ సంఘమా - సర్వాంగమా - పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగా - నీతి నలంకరించి సిద్ధపడుమా
1)రాణి ఓఫిరు అపరంజితో - స్వర్ణవివర్ణ వస్త్రధారణతో
వీణ వాయిద్య తరంగాలతో - ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనందతైల సుగంధాభిషేకము - పొందితివా యేసునందు
|| ఓ ||
2)క్రీస్తే నిను ప్రేమించెనని - తన ప్రాణము నర్పించెనని
స్వస్థపరచె నిర్ధోషముగా - ముడత కళంకము లేనిదిగా
మహిమాయుతముగా నిలుపగోరి యేసువే సహించెను తీర్పునాడు
|| ఓ ||
3)చీకటిలో నుండి వెలుగునకు - లోకములో నుండి వెలుపలకు
శ్రీ కర్త గుణాతిశయములను - ప్రకటించుటకే పిలచెనని
గుర్తించుచుంటివా - క్రియలను గంటివా - సజీవముగనున్నావా
|| ఓ ||
4)చల్లగనైనను వెచ్చగను - ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన - బయటకు ఉమ్మివేయ బడెదవేమో
నీ మనసు మార్చుకో - తొలిప్రేమ కూర్చుకో - ఆసక్తి తోడ నుండుమా
|| ఓ ||
5)కడపటి బూర మ్రోగగానే - కనురెప్ప పాటున మారెదవా
వడిగా మేఘాసీనుడవై - నడి యాకసము నకు పోగలవా
గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా - రారాజు నెదుర్కొన గలవా
|| ఓ ||
English O Sanghamaa Sarvaangamaa
ChorusO Sanghamaa - Sarvaangamaa - Paraloka Raajyapu Pratibinbamaa
Yesayyanu Edurkonagaa - Neeti Nalankarinchi Sidhapadumaa
1)Raani Ophiru Aparanjito - Svarnavivarna Vastradhaaranato
Veena Vaayidya Tarangaalato - Praanesvaruni Prasannatato
Aanandataila Sugandhaabhishekamu - Ponditivaa Yesunandu
|| O ||
2)Kreeste Ninu Preminchenani - Tana Praanamu Narpinchenani
Svasthaparache Nirdhoshamugaa - Mudata Kalankamu Lenidigaa
Mahimaayutamuugaa Nilupagori Yesuve Sahinchenu
Teerpunaadu
|| O ||
3)Cheekatilo Nundi Velugunaku - Lokamulo Nundi Velupalaku
Sree Karta Gunaatisayamulanu - Prakatinchutake Pilachenani
Gurtinchuchuntivaa - Kriyalanu Gantivaa - Sajeevamuganunnaavaa
|| O ||
4)Challaganainanu Vechchaganu - Undina Neekadi Melagunu
Nulivechchani Sthiti Neekundina - Bayataku Ummiveya
Badedavemo - Nee Manasu Maarchuko - Toliprema Koorchuko
Aasakti Toda Nundumaa
|| O ||
5)Kadapati Boora Mrogagaane - Kanureppa Paatuna Maaredavaa
Vadigaa Meghaaseenudavai - Nadi Yaakasamu Naku Pogalavaa
Gorrepilla Sanghamaa Kreesturaaju Sanghamaa
Raaraaju Nedurkona Galavaa
|| O ||