తెలుగు క్రీస్తుయేసు నీకున్న మనసు
పల్లవిక్రీస్తుయేసు నీకున్న మనసు మాలో కలిగించుమా - దేవా
మాలో పుట్టించుమా - పెద్దలైనా చిన్నలైనా వినయము గల్గి
నడుచుట నేర్పుము - గర్వము నాశన హేతువనియు ఎరిగే
మనసిమ్ము దేవా- వినయ మనసునిమ్ము
1)దేవునితోడ సముడగునీవు - దీనునిగా ధర జన్మించినావు
దాసుని రూపము ధరియించి నీవు - దాసులబ్రోచావు పాప
దాసుల బ్రోచావు
|| క్రీస్తు ||
2)ఘనతకు ముందు వినయముండునని బోధలు బహుగా
చేతుముగాని - వినయము మాలో మచ్చుకులేదు - వినయము
గల ప్రభువా - నీవినయము నేర్పుమయా
|| క్రీస్తు ||
3)అధికార దాహము అంతరంగములో - అధికముగానే కలిగియుంటిమి
సర్వాధికారి అన్నియువీడి రిక్తుడవయ్యావూ - నీ బుద్ధిని
మా కిమ్ము
|| క్రీస్తు ||
4)పార్టీతత్వము పోటీతత్వము - పీఠాధిపత్యపు కోరిక
మాన్పుము - మతస్థులవలె మతి హీనముగ మసలుట
మాన్పుమయా దేవా మసలుట మాన్పుమయా
|| క్రీస్తు ||
5)ప్రేమ చల్లారి ద్వేషము పెరిగెను - ప్రేమ సువార్త చాటుట
మాని - సమస్యలతో సతమత మగుచు - చల్లారి
పోయాము నులివెచ్చగ నున్నాము
|| క్రీస్తు ||
English Kreestuyesu Neekunna Manasu
ChorusKreestuyesu Neekunna Manasu Maalo Kaliginchumaa - Devaa
Maalo Puttinchumaa - Peddalainaa Chinnalainaa Vinayamu Galgi
Naduchuta Nerpumu - Garvamu Naasana Hetuvaniyu Erige
Manasimmu Devaa- Vinaya Manasunimmu
1)Devunitoda Samudaguneevu - Deenunigaa Dhara Janminchinaavu
Daasuni Roopamu Dhariyinchi Neevu - Daasulabrochaavu Paapa
Daasula Brochaavu
|| Kreestu ||
2)Ghanataku Mundu Vinayamundunani Bodhalu Bahugaa
Chetumugaani - Vinayamu Maalo Machchukuledu - Vinayamu
Gala Prabhuvaa - Neevinayamu Nerpumayaa
|| Kreestu ||
3)Adhikaara Daahamu Antarangamulo - Adhikamugaane Kaligiyuntimi
Sarvaadhikaari Anniyuveedi Riktudavayyaavoo - Nee Buddhini
Maa Kimmu
|| Kreestu ||
4)Paarteetatvamu Poteetatvamu - Peethaadhipatyapu Korika
Maanpumu - Matasthulavale Mati Heenamuga Masaluta
Maanpumayaa Devaa Masaluta Maanpumayaa
|| Kreestu ||
5)Prema Challaari Dveshamu Perigenu - Prema Suvaarta Chaatuta
Maani - Samasyalato Satamata Maguchu - Challaari
Poyaamu Nulivechchaga Nunnaamu
|| Kreestu ||