Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 552 Old No: 513

ఘనదైవ దివితేజ

Ghanadaiva Diviteja

Open in Word & Worship App
తెలుగు   ఘనదైవ దివితేజ
పల్లవి
ఘనదైవ దివితేజ దర్శించుము - మహిమాత్మతో - మము నింపుము
యేసు రాజా - మా నీతి రాజా
1)
సాక్ష్య జీవితము - సన్నగిల్లి పోయె
సహకార సహవాసం - ప్రేమ హీనమయ్యె
మము కరుణించి - నూతన పరచుము
|| ఘనదైవ ||
2)
ప్రార్థన ఫలములు - పొందకపోతిమి
నీ సేవయందున సోమరులమైతిమి
ఆత్మల రక్షింప - నీశక్తినీయుమా
|| ఘనదైవ ||
3)
నీదు చిత్తము చేయ - నేర్పించుమయ్యా
నిను వెంబండింపగ - వెలుగిమ్మయ్యా
ఆశతో నీ దరి - జేరితిమయ్యా
|| ఘనదైవ ||
4)
మా యువతరమంతా - పాడైపోయి
శాంతి సమాధానం - కరువైపోయె
ప్రకటించెదము నీ - ప్రేమ వార్త
|| ఘనదైవ ||
English   Ghanadaiva Diviteja
Chorus
Ghanadaiva Diviteja Darsinchumu - Mahimaatmato - Mamu Ninpumu
Yesu Raajaa - Maa Neeti Raajaa
1)
Saakshya Jeevitamu - Sannagilli Poye
Sahakaara Sahavaasan - Prema Heenamayye
Mamu Karuninchi - Nootana Parachumu
|| Ghanadaiva ||
2)
Praarthana Phalamulu - Pondakapotimi
Nee Sevayanduna Somarulamaitimi
Aatmala Rakshinpa - Neesaktineeyumaa
|| Ghanadaiva ||
3)
Needu Chittamu Cheya - Nerpinchumayyaa
Ninu Venbandinpaga - Velugimmayyaa
Aasato Nee Dari - Jeritimayyaa
|| Ghanadaiva ||
4)
Maa Yuvataramantaa - Paadaipoyi
Saanti Samaadhaanan - Karuvaipoye
Prakatinchedamu Nee - Prema Vaarta
|| Ghanadaiva ||
Present