తెలుగు సన్నుతింతుమో ప్రభో
పల్లవిసన్నుతింతుమో ప్రభో - సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా - కలుషము నెడబాపుమా
1)నీతిసూర్య తేజమా - జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా - పతితపావన నామకా
|| సన్ను ||
2)మానవ సంరక్షకా - దీన నిచయ పోషకా
దేవమానవ నందనా - దివ్యసుగుణ మందనా
|| సన్ను ||
3)ప్రేమ తత్వబోధకా - క్షేమదాత నీవెగా
కామిత ఫలదాయక - స్వామి యేసునాయకా
|| సన్ను ||
4)పాపచింతలన్నిటిన్ - పారదోలుమో ప్రభో
నీపవిత్ర నామమున్ - నిరతము స్మరియించెదన్
|| సన్ను ||
English Sannutiotumo Prabho
ChorusSannutintumo Prabho - Sadamalamagu Bhaktito
Kannatandri Kaavumaa - Kalushamu Nedabaapumaa
1)Neetisoorya Tejamaa - Jyotiratna Raajamaa
Paatakajana Rakshakaa - Patitapaavana Naamakaa
|| Sannu ||
2)Maanava Samrakshakaa - Deena Nichaya Poshakaa
Devamaanava Nandanaa - Divyasuguna Mandanaa
|| Sannu ||
3)Prema Tatvabodhakaa - Kshemadaata Neevegaa
Kaamita Phaladaayaka - Svaami Yesunaayakaa
|| Sannu ||
4)Paapachintalannitin - Paaradolumo Prabho
Neepavitra Naamamun - Niratamu Smariyinchedan
|| Sannu ||