తెలుగు ఉజ్జీవ జ్వాలలు రగిలింపుము
పల్లవిఉజ్జీవ జ్వాలలు రగిలింపుము - నిర్జీవ స్థితి నాలో తొలగింపుము
1)గతకాలపు పతనము చూడ - గతుకుల పుంతయె నా బ్రతుకు
మితిమీరి గర్వించితిని - సుతి తప్పి పరుగెత్తితిని
|| ఉజ్జీవ ||
2)దినమెల్లను తొట్రిల్లితిని - నిలువెల్లను దిగజారితిని
ఇకనైనను నీ కృపచేత - నికరముగా నను నిలుపు ప్రభో
|| ఉజ్జీవ ||
3)నడకలో పడకలో తప్పితిని - చూపులో తలపులో తప్పితిని
తప్పును ఒప్పక కప్పితిని - గొప్పను మెప్పును కోరితిని
|| ఉజ్జీవ ||
4)నాలో వక్రతయే హెచ్చు - నీలో వాత్సల్యమే మెండు
హిస్సోపు పుడకతో కడిగి నను - హిమముగ మార్చుము క్షమతోడ
|| ఉజ్జీవ ||
5)నాలో శిలలను తొలగించి - నాలో చెత్తను దహియించు
మడ్డిని అగ్నిలో మరగించు - మష్టును కొలిమిలో కరగించు.
|| ఉజ్జీవ ||
English Ujjeeva Jvaalalu Ragilimpumu
ChorusUjjeeva Jvaalalu Ragilinpumu - Nirjeeva Sthiti Naalo Tolaginpumu
1)Gatakaalapu Patanamu Chooda - Gatukula Puntaye Naa Bratuku
Mitimeeri Garvinchitini - Suti Tappi Parugettitini
|| Ujjeeva ||
2)Dinamellanu Totrillitini - Niluvellanu Digajaaritini
Ikanainanu Nee Krupacheta - Nikaramugaa Nanu Nilupu Prabho
|| Ujjeeva ||
3)Nadakalo Padakalo Tappitini - Choopulo Talapulo Tappitini
Tappunu Oppaka Kappitini - Goppanu Meppunu Koritini
|| Ujjeeva ||
4)Naalo Vakrataye Hechchu - Neelo Vaatsalyame Mendu
Hissopu Pudakato Kadigi Nanu - Himamuga Maarchumu Kshamatoda
|| Ujjeeva ||
5)Naalo Silalanu Tolaginchi - Naalo Chettanu Dahiyinchu
Maddini Agnilo Maraginchu - Mashtunu Kolimilo Karaginchu.
|| Ujjeeva ||