తెలుగు ఓహో క్రైస్తవుడా
పల్లవిఓహో క్రైస్తవుడా
ఏది విశ్వాస పరిమాణము - ఏది ఆత్మీయ కొలమానము
రాటుదేలిన విశ్వాసివేనా - గీటుకొచ్చే పుత్తడివేనా
పరీక్షించుకుందామా - విమర్శించుకుందామా
1)పరిశుద్ధ పరిచర్యలో పాలివాడవా - పాపములో జీవిస్తూ సేవ చేతువా
భక్తి గల బిడ్డగా ఎందుకా సేవ - వేషదారిగా ఎందుకా జీవితము
|| ఓహో ||
2)లయమయ్యే లోకానికి అమ్ముడుపోయావా - రాయితీల కొరకు రాజీ పడ్డావా
క్రీస్తునే ఎరుగనని ప్రకటిస్తున్నావా - క్రైస్తవుడనె కానని రాసిస్తున్నావా
|| ఓహో ||
3)లోకాచారాలకు లోనైపోయావా - ముహూర్తాలు మంచిరోజు పాటిస్తున్నావా
వాస్తులూ జాతకాలు నమ్ముతున్నావా - ప్రభువు బిడ్డవేనా ప్రియ శిష్యుడవేనా
|| ఓహో ||
4)కులమత భేదాలతో గర్విస్తున్నావా - కట్నాలు కానుకలూ కోరుతున్నావా
వడ్డీలకు డబ్బులిచ్చి కూడబెట్టుచున్నావా - లంచాలు లాంఛనంగ లాగుతున్నావా
|| ఓహో ||
5)దేవుని తీర్పును నీవు తట్టుకొనగలవా - న్యాయపీఠము ముందు నిలువబడగలవా
ఇప్పుడైనా నీ సాక్ష్యం సరిచేసుకో - యోగ్యమైన బిడ్డగా కొనసాగిపో
|| ఓహో ||
English Oho Kraistuvudaa
ChorusOho Kraistavudaa
edi Visvaasa Parimaanamu - edi Aatmeeya Kolamaanamu
Raatudelina Visvaasivenaa - Geetukochche Puttadivenaa
Pareekshinchukundaamaa - Vimarsinchukundaamaa
1)Parisudha Paricharyalo Paalivaadavaa - Paapamulo Jeevistoo Seva Chetuvaa
Bhakti Gala Biddagaa Endukaa Seva - Veshadaarigaa Endukaa Jeevitamu
|| Oho ||
2)Layamayye Lokaaniki Ammudupoyaavaa - Raayiteela Koraku Raajee Paddaavaa
Kreestune Eruganani Prakatistunnaavaa - Kraistavudane Kaanani
Raasistunnaavaa
|| Oho ||
3)Lokaachaaraalaku Lonaipoyaavaa - Muhoortaalu Manchiroju Paatistunnaavaa
Vaastuloo Jaatakaalu Nammutunnaavaa - Prabhuvu Biddavenaa Priya
Sishyudavenaa
|| Oho ||
4)Kulamata Bhedaalato Garvistunnaavaa - Katnaalu Kaanukaloo Korutunnaavaa
Vaddeelaku Dabbulichchi Koodabettuchunnaavaa - Lanchaalu Laanchananga
Laagutunnaavaa
|| Oho ||
5)Devuni Teerpunu Neevu Tattukonagalavaa - Nyaayapeethamu Mundu
Niluvabadagalavaa
Ippudainaa Nee Saakshyan Sarichesuko - Yogyamaina Biddagaa Konasaagipo
|| Oho ||