తెలుగు శ్రమలు లేని జీవితమును
పల్లవిశ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరా!
శ్రమలు లేని జీవితములో క్రమము దొరకదు సోదరీ!
1)క్రీస్తు ప్రభు తన జీవితాంతము - శ్రమల నోర్చెను సోదరా!
క్రీస్తునందలి భక్తిపరులే - శ్రమల నోర్తురు సోదరీ!
|| శ్రమ ||
2)పాప భోగానందములను మోషే విడిచెను సోదరా!
క్రీస్తు నందలి ఘోర శ్రమలానందమనుకొనె సోదరీ!
|| శ్రమ ||
3)అగ్నిలాంటి శ్రమలు మనలను ఏమి చేయవు సోదరా!
క్షణము శ్రమపడి శాశ్వితముగా సౌఖ్యమొంద బోదుము
|| శ్రమ ||
4)శ్రమలు బాధలు నొందు వేళలో ప్రభువు మనతో నుండును
తాను మనతో నుండు వేళలో శ్రమలలో ఆనందమే
|| శ్రమ ||
5)శ్రమలు శోధన బాధలన్నియు భక్తులకు బలమిచ్చురా
శ్రమలు కొలిమి లేని బ్రతుకు చిలుము బట్టును సోదరా
|| శ్రమ ||
English Sramalu Leni Jeevitamunu
ChorusSramalu Leni Jeevitamunu Korukonakumu Sodaraa!
Sramalu Leni Jeevitamulo Kramamu Dorakadu Sodaree!
1)Kreestu Prabhu Tana Jeevitaantamu - Sramala Norchenu Sodaraa!
Kreestunandali Bhaktiparule - Sramala Norturu Sodaree!
|| Srama ||
2)Paapa Bhogaanandamulanu Moshe Vidichenu Sodaraa!
Kreestu Nandali Ghora Sramalaanandamanukone Sodaree!
|| Srama ||
3)Agnilaanti Sramalu Manalanu emi Cheyavu Sodaraa!
Kshanamu Sramapadi Saasvitamugaa Saukhyamonda Bodumu
|| Srama ||
4)Sramalu Baadhalu Nondu Velalo Prabhuvu Manato Nundunu
Taanu Manato Nundu Velalo Sramalalo Aanandame
|| Srama ||
5)Sramalu Sodhana Baadhalanniyu Bhaktulaku Balamichchuraa
Sramalu Kolimi Leni Bratuku Chilumu Battunu Sodaraa
|| Srama ||